సీఎం దుప్పట్లు పంచారు.. అధికారులు లాగేసుకున్నారు..

ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత తమ దుప్పట్లను లాగేసుకున్నారని అక్కడి శిబిరంలో ఆశ్రయం పొందుతున్నవారు తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. బాధ్యులైన అధికారులపై చర్యలకు సిద్దమయ్యారు.

news18-telugu
Updated: December 29, 2019, 7:42 PM IST
సీఎం దుప్పట్లు పంచారు.. అధికారులు లాగేసుకున్నారు..
దుప్పట్లు పంపిణీ చేస్తున్న సీఎం యోగి ఆదిత్యానాథ్
  • Share this:
లక్నోలో నిరాశ్రయులైన పేదలు రాత్రిపూట నిద్రించేందుకు కొన్ని శిబిరాలను ఏర్పాటు చేశారు. నగరంలోని డోలిగంజ్‌, ప్రభుత్వ ఆసుపత్రి సమీపాల్లో ఇటీవల వీటిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గురువారం ఆ శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలం కావడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతల కారణంగా చలితో ఇబ్బందిపడవద్దన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లిపోగానే స్థానిక అధికారులు వారి నుంచి దుప్పట్లు లాగేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత తమ దుప్పట్లను లాగేసుకున్నారని అక్కడి శిబిరంలో ఆశ్రయం పొందుతున్నవారు తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. బాధ్యులైన అధికారులపై చర్యలకు సిద్దమయ్యారు.వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు.First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు