• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • HOME MINISTER AMIT SHAH HOLDING IMPORTANT SECURITY REVIEW MEETING INSIDE THE PARLIAMENT SB

కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది? అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం

కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది? అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కాశ్మీర్‌లో ఉగ్ర మూకలు హింస సృష్టించే అవకాశముందని పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు చేపట్టిన సంగతి తెలిసిందే. అందుకే అమర్‌నాథ్ యాత్రను కూడా రద్దు చేశారు.

  • Share this:
    బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌, రా అధిపతి సమంత్‌ గోయల్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ గౌబా హాజరయ్యారు. ఈ భేటీలో జమ్ముకాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి, ఎల్‌ఓసీ వెంబడి నెలకొన్న పరిస్థితులపై సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కశ్మీర్‌లో ఉగ్ర మూకలు హింస సృష్టించే అవకాశముందని పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు చేపట్టిన సంగతి తెలిసిందే. అమర్‌నాథ్‌ యాత్రను కూడా నిలిపివేశారు. కశ్మీర్‌లో పరిస్థితిపై పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా, అమర్ నాథ్ యాత్ర నిలిపివేత, కశ్మీర్ కు అదనపు బలగాల తరలింపు అంశంపై రేపు పార్లమెంటులో ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో అమిత్ షా చర్చిస్తారని తెలుస్తోంది. మరో వైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ దేశ ‘జాతీయ భద్రతా కమిటీ’(ఎన్‌ఎస్‌సీ)తో అత్యున్నత సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

    కాశ్మీర్‌లో ఏం జరుగుతుందన్న అంశంపై ఇమ్రాన్ ఖాన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. జమ్ము కశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్ము కశ్మీర్‌ రిజర్వేషన్‌ (రెండో సవరణ) బిల్లు-2019ను రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కీలక భేటీ నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు