హైదరాబాద్‌లో ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరైన అమిత్ షా

సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 70వ బ్యాచ్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది.

news18-telugu
Updated: August 24, 2019, 11:47 AM IST
హైదరాబాద్‌లో ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరైన అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా
news18-telugu
Updated: August 24, 2019, 11:47 AM IST
తెలంగాణలో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సివిల్‌ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు ఎంపికై హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 70వ బ్యాచ్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది. అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఐపీఎస్‌‌ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 92 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరి నుంచి తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు.ఈ కార్యక్రమానికి అమిత్ షాతో పాటు..కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఐపీఎస్‌ శిక్షణలో టాపర్ గా నిలిచిన గౌస్ అలంను తెలంగాణకు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడన అమిత్ షా దేశ రక్షణలో ఐపీఎస్‌ల పాత్ర  ఎంతో కీలకమైందన్నారు. మీ పాత్ర ఇప్పటి నుంచే ప్రారంభమైందన్నారు షా. జమ్ముకాశ్మీర్‌పై ఎవరూ చేయలేని పనిన మోదీ చూసి చూపారన్నారు. దేశ రక్షణ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. సర్ధార్ పటేల్ వల్లే దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైందన్నారు. హైదరాబాద్ సంస్థానంలో అరాచకాల్ని పటేల్ అణచివేశారన్నారు అమిత్ షా.



First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...