HOME »NEWS »POLITICS »hmt seats may decide jds congress coalition government fate in karnataka ak

ఆ మూడు సీట్లలో తేడా వస్తే కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందా ?

ఆ మూడు సీట్లలో తేడా వస్తే కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందా ?
రాహుల్ గాంధీతో కుమారస్వామి(ఫైల్ ఫోటో)

కర్ణాటకలో తమ మిత్రపక్షం జేడీఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది కాంగ్రెస్. పొత్తుల్లో భాగంగా జేడీఎస్‌కు 8 సీట్లు కేటాయించిన కాంగ్రెస్... మిగిలిన 20 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దిగింది. అయితే ఎన్నికల్లో భాగంగా మిత్రధర్మాన్ని పాటించిందా లేదా అనే అంశంపై జేడీఎస్‌లో కలవరం మొదలైంది.

  • Share this:
    లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై రాజకీయ పార్టీల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితాల ఆధారంగా కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో లేదో అనే టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంటే... కర్ణాటకలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. కర్ణాటకలో తమ మిత్రపక్షం జేడీఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది కాంగ్రెస్. పొత్తుల్లో భాగంగా జేడీఎస్‌కు 8 సీట్లు కేటాయించిన కాంగ్రెస్... మిగిలిన 20 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దిగింది. అయితే ఎన్నికల్లో భాగంగా మిత్రధర్మాన్ని పాటించిందా లేదా అనే అంశంపై జేడీఎస్‌లో కలవరం మొదలైంది.

    జేడీఎస్ తరపున పోటీ చేసిన 8 మంది అభ్యర్థుల్లో ముగ్గురు దేవేగౌడ కుటుంబసభ్యులే కావడం విశేషం. తూముకురు నుంచి దేవేగౌడ, హసన్ నుంచి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్, మాండ్య నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలోకి దిగారు. అయితే ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ శ్రేణులు జేడీఎస్‌కు అనుకూలంగా పని చేయలేదనే ప్రచారం జరుగుతోంది. మాండ్యలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన నటి సుమలతకు అనుకూలంగా కాంగ్రెస్ శ్రేణులు పని చేశాయని కుమారస్వామి భావిస్తున్నట్టు తెలుస్తోంది.



    దేవేగౌడ పోటీ చేసిన తూముకురు, ప్రజ్వల్ పోటీ చేసిన హసన్‌లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందన్నది జేడీఎస్ నేతల అనుమానం. దీంతో ఈ మూడు సీట్లలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దాన్ని బట్టే కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందో లేదో తేలుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలుతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తుండగా... తాజాగా ఈ రెండు పార్టీల మధ్య స్నేహం మూడు లోక్ సభ స్థానాల ఫలితాలపై ఆధారపడి ఉందన్న ప్రచారం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:May 11, 2019, 09:49 IST