అందరి చూపు దాని పైనే.. హైదరాబాద్‌లో బాహుబలి లేఅవుట్

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లోని కోకాపేట్ పరిధిలో హెచ్ఎండీఏ 'బాహుబలి లేఅవుట్'కు ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 146 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భూముల్లో అధునాతన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

 • Share this:
  హైదరాబాద్.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే నలువైపులా విస్తరించడానికి చుట్టూ వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు ఇదో వరం అనే చెప్పాలి. అందుకే హైదరాబాద్‌లో భూములు అమ్మయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని కోకాపేట్ పరిధిలో హెచ్ఎండీఏ 'బాహుబలి లేఅవుట్'కు ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 146 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భూముల్లో అధునాతన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణఆనికి అనువుగా ఒక్కో ప్లాట్ కనీసం 10వేల చదరపు గజాల నుంచి 25వేల చదరపు గజాల వరకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

  జేసీబీల సాయంతో ఇప్పటికే రాళ్లు గుట్టలు తొలగించి అక్కడి భూమినంతా అధికారులు చదును చేయించారు. 35మీ.-45మీ. వెడల్పుతో అక్కడ రోడ్లు నిర్మించనున్నారు.
  ఎనిమిది లేన్ల రోడ్డు,ఫుట్‌పాత్,సైకిల్ ట్రాక్,గ్రీనరీ డివైడర్‌ ఉండేలా లేఅవుట్‌ను తీర్చిదిద్దనున్నారు. హద్దురాళ్లను పాతగానే భూ క్రయవిక్రయాలు జరపనున్నారు. ఎకరానికి రూ.30కోట్లు చొప్పున మొత్తం రూ.3వేల కోట్లు వరకు ఆదాయం సమకూరే ఉందంటున్నారు. కోకాపేటతో పాటు దాని సమీపంలో ఉన్న హెచ్ఎండీఏకి చెందిన 571 ఎకరాలను ఈవేలం జరిపితే రూ.5వేల కోట్లు సమకూరే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద హెచ్ఎండీఏ రూపొందిస్తున్న ఈ బాహుబలి లేఅవుట్‌పై ఇప్పుడు అందరి చూపు పడింది.
  Published by:Srinivas Mittapalli
  First published: