పోలీసుల తీరుతో హర్ట్ అయిన బాలకృష్ణ.. కారులో ఒంటరిగానే...
బెంగళూరు వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాలంటూ మూడు పోలీస్ స్టేషన్లలో బాలయ్య సమాచారం ఇచ్చారు. అయితే, పోలీసుల నుంచి స్పందన రాలేదు.
news18-telugu
Updated: October 25, 2019, 6:19 PM IST

బాలకృష్ణ NBK 105 న్యూ లుక్ (Twitter/Photo)
- News18 Telugu
- Last Updated: October 25, 2019, 6:19 PM IST
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఘోర అవమానం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆయన బెంగళూరు వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాలంటూ మూడు పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చారు. అయితే, ఆయనకు ఎస్కార్ట్ ఇవ్వడానికి ముందుకురాలేదు. దీంతో బాలకృష్ణ ఒక్కరే తన వాహనంలో బెంగళూరు వెళ్లిపోయారు.
నిన్న హిందూపురంలో బాలకృష్ణను కొందరు ప్రజలు అడ్డుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలయ్య వెళ్తుండగా బాలయ్యను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురంజిల్లా లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు బాలకృష్ణను అడ్డగించారు. లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి దాదాపుగా సంవత్సరం అయ్యింది. అయినా కూడా ఇంతవరకు పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో బాలయ్య వాహనాన్ని అడ్డుకొని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు.
నిన్నటి ఘటన నేపథ్యంలో బాలకృష్ణ బెంగళూరు పర్యనటకు వెళ్లేముందు తనకు ఎస్కార్ట్ కావాలంటూ మూడు పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చారు. అయితే, పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. దీంతో బాలయ్య ఒంటరిగానే తన వాహనంలో వెళ్లిపోయారు. బాలయ్యకు ప్రభుత్వం కావాలనే భద్రత కల్పించడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది.ధన్తేరస్ ఎందుకొచ్చింది.. బొమ్మల కథ..

Ruler Pre Release | బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్...
బాలకృష్ణ రూలర్ ప్రభంజనం.. ‘అడుగడుగో యాక్షన్ హీరో’..
బాలకృష్ణను సవాల్ చేయనున్న ఎమ్మెల్యే రోజా..
హీరో అజిత్ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన బాలయ్య
బరిలోకి బాలయ్య.. సీఎం జగన్పై సంధిస్తున్న చంద్రబాబు?
లారీ డ్రైవర్ కూతురికి బాలకృష్ణ సాయం.. ఉచితంగా...
Loading...