Home /News /politics /

HINDUPUR MLA NANDAMURI BALA KRISHNA SLAMS YSRCP LED GOVERNMENT OVER ATTACK ON TELUGU DESHAM PARTY ACTIVISTS DURING PANCHAYAT ELECTIONS HERE ARE THE DETAILS PRN

Bala Krishna: వైసీపీకి బాలకృష్ణ వార్నింగ్... లెక్కసరిచేస్తామన్న ఎమ్మెల్యే

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

AP Politics: టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) అధికార పార్టీకి మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికాల వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ఏకగ్రీవాలు, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. కొన్నిచోట్ల తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడుతోంది. టీడీపీ ఆరోపణలకు వైసీపీ కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధికార పార్టీకి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ ఖాళీగా కూర్చోలేదని.. ఖచ్చితంగా బదులు తీర్చుకొని తీరతామని స్పష్టం చేశారాయన.

    సోమవరాలం తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటించిన నందమూరి బాలకృష్ణ.. ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరిశీలించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో వైసీపీ పాలన దారుణంగా ఉందని.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మమ్మల్ని బెదిరిస్తే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇది కేవలం టీడీపీకే కాదని.. సమాజానికే ప్రమాదమని బాలయ్య అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పదేళ్లు కాదు.. వందేళ్లు వెనక్కి వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఉపాది లేక యువకులు మనస్తాపంతో ఉన్నారని.. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు లేకపోగా.. గంజాయి, మద్యం లాంటివి మాత్రం అందుబాటులో ఉన్నాయన్నారు.

    ఇది చదవండి: నిన్న జనసేన..నేడు ఏపీ బీజేపీ..విశాఖ స్టీల్ పై కేంద్రం మనసు మార్చుకుంటుందా..?



    పంచాయతీ ఎన్నికల సందర్భంగా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదని బాలకృష్ణ అన్నారు. వైసీపీ ఎన్ని అరాచకాలు సృష్టించినా ప్రజలు మాత్రం టీడీపీవైపే ఉన్నారని బాలకృష్ణ అన్నారు. గతంలో హిందూపురంలో పర్యటించిన సందర్భంగా వైసీపీ నేతలను రాక్షసులతో టీడీపీ నేతలను దేవతలో పోల్చారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, AP Politics, Bala Krishna, Bala Krishna Nandamuri, Hindupuram, Nandamuri Balarkrishna, Tdp, Telugu news, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు