‘ఆ వీడియో’ బయటపడడంతో ఇద్దరు బీజేపీ నేతలపై వేటు..

ఓ బీజేవైఎం నాయకుడు, ఓ మహిళతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 12.35 నిమిషాలు ఉన్న ఆ వీడియో పెద్ద దుమారాన్ని రేపింది.

news18-telugu
Updated: July 28, 2019, 8:33 PM IST
‘ఆ వీడియో’ బయటపడడంతో ఇద్దరు బీజేపీ నేతలపై వేటు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బీజేపీ నాయకులను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కులు జిల్లాకు చెందిన ఓ బీజేవైఎం నాయకుడు, ఓ మహిళతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 12.35 నిమిషాలు ఉన్న ఆ వీడియో పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ పెద్దలు ప్రకటించారు. ఆ వీడియోలో ఉన్న మహిళే.. దాన్ని ఆ బీజేవైఎం నేతకు పంపిందని.. అయితే, ఆ వీడియో బీజేవైఎం నేత భార్య కంటపడింది. దీంతో సదరు నేత భార్య.. వీడియోలో ఉన్న యువతికి ఫోన్ చేసి.. తన భర్త వెంట పడొద్దని హెచ్చరించింది. అయితే, ఆ తర్వాత ఆ ఇద్దరు యువతుల సంభాషణ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చిందనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ వీడియోలను వాట్సాప్ గ్రూప్స్‌లో ప్రచారం చేసిన వారి మీద కూడా చర్యలు తీసుకుంటారంటూ ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని పోలీసులు తెలిపారు.

First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు