Home /News /politics /

HIMACHAL PRADESH DHARAMSHALA BJP MLA OSHIN SHARMAS WIFE ALLEGES HARASSMENT OF VISHAL NEHRIA SNR

మా ఆయన అస్సలు మంచోడు కాదు..ఎమ్మెల్యేపై ప్రధాని, సీఎంకి భార్య ఫిర్యాదు

Photo Credit: Youtube

Photo Credit: Youtube

Himachal pradesh: భర్త పెట్టే వేధింపులు భరించలేనంటూ ఓ ఎమ్మెల్యే భార్య మీడియా ముందుకొచ్చింది. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి భార్యను చిత్రహింసలు పెడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోరని ప్రధాని, ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆడవాళ్లు ఆత్మాభిమానాన్ని చంపుకొని బయటకొచ్చి ఫిర్యాదు చేస్తే వారిని మానసికంగా వేధిస్తారా అంటూ కన్నీటిపర్యంతమైంది ఆ అధికారిణి.

ఇంకా చదవండి ...
నా భర్త బయటకు కనిపించేంత మంచి వాడుకాదంటోంది ఆమె. ఆయనేమో లేదు మేమిద్దరం కలిసే ఉంటున్నామంటాడు. అసలు ఆ భార్యభర్తల మధ్య ఏం జరిగింది. అందరికి ఇదే డౌట్‌ వస్తుంది. కొద్దిరోజులు బాగానే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆరోపణలు చేసుకుంటారు. ఇదేంటని భావిస్తున్న సమయంలో మేడమ్ ప్రెస్‌మీట్ పెట్టారు. తన భర్తపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)ధర్మశాల (Dharamshala)నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా(Vishal Nehria)పై ఆయన భార్య హెచ్‌ఏఎస్‌ (Has)అధికారి ఒషిన్‌శర్మ (Oshin Sharma)మీడియా ముందుకొచ్చి మెట్టినింట్లో తాను పడుతున్న ఇబ్బందులు మీడియాతో చెప్పుకొని కన్నీరు కార్చారు. ప్రజాప్రతినిధి అయినటువంటి విశాల్‌ నెహ్రియా తనను చిత్రహింసలు పెడుతున్నాడని ఆరోపించారు. ఇంట్లో ఉండలేని విధంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒషిన్‌శర్మ(Vishal Nehria). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటికో బచావో-భేటికో పడావో అని ప్రచారం చేస్తున్నాయి. బాగానే ఉంది. కానీ ఆడపిల్లల్ని కాపాడుకుందా, ఆడపిల్లల్ని చదివించుకుందా అంతకంటే ముందు మగవాళ్లను సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈవిషయంలో ప్రధాని మోదీ(Pm modi), సీఎం జైరాం ఠాకూర్‌ (Jairam thakur)తన అభ్యర్ధనను, విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు ఒషిన్‌ శర్మ.

నా భర్త ఎమ్మెల్యే ..అస్సలు మంచోడు కాదండి..
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఓ ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని ఎంతో మంది జీవితాలను కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. అతను పదవిలో ఉన్నాడు కాబట్టి ఎవరూ ధైర్యంగా ముందుకు వచ్చి అతని గురించి చెడుగా చెప్పుకోలేకపోతున్నారని ..కానీ చాలా విషయాలు తన దృష్టికి వచ్చాయంటూ ఒషిన్‌శర్మ భర్తపైనే విమర్శలు చేశారు. ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఒకలా ..ఇంట్లో తన దగ్గర మరోలా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారామె. గతంలో కూడా చాలా సార్లు గొడవపడ్డామని..ఆ తర్వాత రాజీ పడ్డామని చెప్పారు. తన భర్త తనతో మంచిగా ఉంటున్నట్లు భ్రమ కలిగించారని..ఎదురు తిరిగితే తన అనుచరులు, సన్నిహితులతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తిట్టే ముందు, విమర్శించే ముందు వాళ్ల కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలంటూ హితవు పలికారు. ఈ విషయంలో తానకు న్యాయం జరిగే వరకూ అతని నీచమైన చరిత్ర బయటపెట్టే వరకూ ఏ న్యాయస్థానం వరకూ వెళ్లైనా పోరాడతానన్నారు ఒషిన్‌శర్మ.

నాకు అండగా నిలుస్తారా ..
బిలాస్‌పూర్ జిల్లాలోని మీడియాతో మాట్లాడిన ఒషిన్‌శర్మ..అధికారం ఉందని విర్రవీగే వాళ్లకు అండగా నిలవద్దని, నాలాంటి ఓ మహిళ ఇలా ధైర్యంగా వచ్చి మాట్లాడినప్పుడు తనకు అండగా నిలవాలని పోలీసులు, న్యాయస్థానం, మీడియాని  విజ్ఞప్తి చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Himachal Pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు