హోమ్ /వార్తలు /రాజకీయం /

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. హైలైట్స్ ఇవే!

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. హైలైట్స్ ఇవే!

గవర్నర్ నరసింహన్(File)

గవర్నర్ నరసింహన్(File)

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలా అభివృద్ది బాటలో పయనిస్తోందన్నారు.

  తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మొదట కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలా అభివృద్ది బాటలో పయనిస్తోందన్నారు. సంక్షేమ, అభివృద్ది పథకాలు, వ్యవసాయ రంగం సహా పలు రంగాల్లో సాధించిన ప్రగతి గురించి వివరించారు.


  గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలు :


  2014 నుంచి 2018 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో 17.17 శాతం సగటున ఆదాయ వృద్ధిరేటును నమోదు చేసింది.


  ప్రస్తుత సంవత్సరంలో 29. 93 శాతం ఆదాయ వృద్ధిరేటును సాధించింది.


  పేదలకు, వృద్ధులకు 1000 నుంచి 15వందలు పెన్షన్ అందిస్తుంది.


  పేదల అడబిడ్డలకు ప్రభుత్వం 1లక్ష 16రూపాయలు అందించే కల్యాణ లక్ష్మీ, షాధి ముబారక్ దేశానికి ఆదర్శనంగా నిలుస్తుంది.


  మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో మొత్తం 66 మున్సిపాలిటీలు, 23,968 జనావాసాలకు మంచినీరు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.


  ఇప్పటికే 56 మున్సిపాలిటీలు, అన్ని గ్రామాలకు నీళ్లు అందిస్తున్నాము.


  18, 612 ఇండ్లలో నల్లాలు బిగించాము. 2019 మార్చ్ నాటికి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు అందిస్తాము.


  చెరువుల పునరుద్ధరణ నాలుగు దశల్లో 20, 171 పూర్తి చేసాము.


  ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టుల కోసం నాలుగున్నర ఏండ్లలో 77, 777 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.


  రాబోయే కాలంలో 1, 17, 000 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేస్తోంది.


  రాష్ట్రంలో 28వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం టార్గెట్ తో ప్లాంట్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది.


  వ్యవసాయ రంగానికి రైతులకు న్యాయం చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాము.


  రైతు బంధు, రైతు భీమా పథకాలు ఐక్యరాజ్య సమితి ప్రశంశలు పొందింది.


  రైతు భీమా ద్వారా 5, 675 మంది రైతు కుటుంబాలకు 283 కోట్ల రూపాయలు అందించాము.


  యాదవులకు ఇప్పటి వరకు 75 లక్షల గొర్రెల పంపిణీ చేసాము..దీంతో12వందల కోట్ల రూపాయల లాభం చేకూరింది.


  విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయి...542 కొత్త నైవాసిక పాఠశాలలు ఏర్పాటు.


  భోజనం, వసతి, సౌకర్యాలు ఒక్కో విద్యార్థు పై 1లక్ష 20వెలు ఖర్చు చేస్తుంది.


  ప్రజారోగ్యంలో 40 డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసింది.


  హైదరాబాద్ నగరంలో 40 బస్తి ధవాఖానాలు ఏర్పాటు చేసింది.


  పరిపాలన సౌకర్యాలు 10 జిల్లాలను 31 జిల్లాలుగా, 43 డివిజన్స్ ని 69 కి పెంచి, 459 మండలాలను.. 584 మందళాలుగా పెంచుకున్నాము.


  రాష్ట్రంలో కొత్తగా 1326 గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసింది.


  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటి వరకు 2లక్షల 72వేల 763 మంజూరు చేసింది.


  గతంలో చెల్లించవల్సిన 4వేల కోట్ల రూపాయల రునబకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది.


  అర్హులైన వారికి ఆసరా పెన్షన్స్ వెయ్యి నుంచి 2, 016 రూపాయలు, దివ్యంగులకు 15వందల నుంచి 3,016 పెంచాలని నిర్ణయం తీసుకుంది.

  First published:

  Tags: CM KCR, Governor Narasimhan, Telangana, Telangana News

  ఉత్తమ కథలు