Home /News /politics /

HIGHCOURT SHOWCAUSE NOTICES TO TELANGANA ASSEMBLY SPEAKER MADHUSUDHANA CHARY

తెలంగాణ సర్కార్‌కి షాక్: స్పీకర్‌కి కోర్టు ధిక్కరణ నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసుధనాచారి(Image: Facebook)

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసుధనాచారి(Image: Facebook)

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల వ్యవహారంలో.. అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు హైకోర్టు ఫామ్-1 షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

    కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల అసెంబ్లీ సభ్యత్వ పునరుద్దరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో.. అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు హైకోర్టు ఫామ్-1 ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 17న వారు స్వయంగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.కోమటిరెడ్డి, సంపత్‌ల జీతభత్యాలు,అసెంబ్లీ రిజిస్టర్ వివరాలను కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను అగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది.

    తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసుధనచారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్దరిస్తారా?..లేక కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌లకు తిరిగి గన్‌మెన్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ నల్గొండ ఎస్పీ, జోగులాంబ ఎస్పీలకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

    కాగా, కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. అయితే అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పలేదు. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చినప్పటికీ.. ఆ తీర్పు ఇప్పటిదాకా అమలు కాలేదు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి కోర్టును ఆశ్రయించగా దీనిపై వాద, ప్రతివాదనలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

    స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎంతటి స్థానంలో ఉన్నవారైనా సరే కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్న తర్వాత కూడా.. గతంలో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోతే.. ఆ పర్యవసనాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి న్యాయస్థానాల మీద గౌరవం లేకపోవడం దురదృష్టకరం అన్నారు
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: High Court, Komatireddy venkat reddy, Madhusudhana chary, Mla sampath kumar, Telangana

    తదుపరి వార్తలు