ఆర్టీసీ ప్రైవేట్ పర్మిట్లపై నేడే తేల్చనున్న హైకోర్టు..? తీర్పుపై ఉత్కంఠ..

TSRTC Strike : ఓవైపు సమ్మె.. మరోవైపు ఆర్థిక మాంద్యం.. ఆర్టీసీ సమస్యను మరింత జటిలం చేశాయని భావిస్తున్నారు. ఆర్టీసీ భారాన్ని ప్రభుత్వం భరించాలంటే ఛార్జీలు పెంచేయాలని.. కానీ అదే చేస్తే ప్రజలు బస్సులు ఎక్కరని సీఎం సమీక్షా సమావేశంలో అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: November 22, 2019, 7:10 AM IST
ఆర్టీసీ ప్రైవేట్ పర్మిట్లపై నేడే తేల్చనున్న హైకోర్టు..? తీర్పుపై ఉత్కంఠ..
హైకోర్టు, కేసీఆర్
  • Share this:
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపడం ప్రభుత్వానికి తీవ్ర భారమని.. వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పుడున్న స్థితిలోనే ఆర్టీసీని యథావిధిగా కొనసాగిస్తే నెలకు రూ.640కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా వేశారు. ప్రతీ నెలా ఇంత భారీగా ఆర్టీసీపై వెచ్చించడం అసాధ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీపై రూ.5వేల కోట్ల అప్పులున్నాయని.. తక్షణం చెల్లించాల్సిన వాటిలో రూ.2వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు.

ఓవైపు సమ్మె.. మరోవైపు ఆర్థిక మాంద్యం.. ఆర్టీసీ సమస్యను మరింత జటిలం చేశాయని భావిస్తున్నారు. ఆర్టీసీ భారాన్ని ప్రభుత్వం భరించాలంటే ఛార్జీలు పెంచేయాలని.. కానీ అదే చేస్తే ప్రజలు బస్సులు ఎక్కరని సమీక్షా సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 5100 బస్సులకు ప్రైవేట్ పర్మిట్లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో.. తీర్పు తర్వాత అన్ని విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి,కోర్టు ఆదేశాలు,ప్రైవేట్ పర్మిట్లతో వచ్చే లాభ నష్టాలు వీటన్నింటిని బేరీజు వేసుకుని ఆర్టీసీ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కార్మికవర్గాలు కోర్టు తీర్పుపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వారు భావిస్తున్నారు.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...