ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు

2012లో నిజామాబాద్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్‌ను సవాల్ చేస్తూ హిందూ సంఘటన్ అధ్యక్షుడు,న్యాయవాది కరుణసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది.

news18-telugu
Updated: December 13, 2019, 1:49 PM IST
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు
అక్బరుద్దీన్ (File)
  • Share this:
2012లో నిజామాబాద్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్‌ను సవాల్ చేస్తూ హిందూ సంఘటన్ అధ్యక్షుడు,న్యాయవాది కరుణసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణ అనంతరం అక్బరుద్దీన్ సహా సీబీసీఐడీ పోలీసులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన అక్బరుద్దీన్ తీరు మార్చుకోకపోగా.. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పిల్‌లో కరుణసాగర్ పేర్కొన్నారు.

కాగా,గతంలో హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అక్బరుద్దీన్ ఇటీవల నిర్మల్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసును హైదరాబాద్ కోర్టుకు బదిలీ చేయాలని ఆయన కోరారు. న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకుంది.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>