కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు : 4 వారాల్లో దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Highcourt issues notice to KCR : అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినందువల్ల కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ కోర్టుకు అప్పీల్ చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్‌తో పాటు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది.

news18-telugu
Updated: March 29, 2019, 5:41 PM IST
కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు : 4 వారాల్లో దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
సీఎం కేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్‌పై వివరణ కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు కేసీఆర్‌పై ఈ పిటిషన్ దాఖలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్‌లో ఆరోపించారు. ఆయనపై 64 కేసులు ఉంటే కేవలం 4 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపించారని అందులో పేర్కొన్నారు.

అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినందువల్ల కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ కోర్టుకు అప్పీల్ చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్‌తో పాటు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

First published: March 26, 2019, 3:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading