Dubbaka ByPoll: దుబ్బాకలో టెన్షన్.. టెన్షన్.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట

Dubbaka ByPoll: రెవెన్యూ, పోలీసు అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

news18-telugu
Updated: October 26, 2020, 8:59 PM IST
Dubbaka ByPoll: దుబ్బాకలో టెన్షన్.. టెన్షన్.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమపై వేధింపులకు దిగుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రెవెన్యూ, పోలీసు అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. రఘునందన్‌ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్‌ రావు నివాసాల్లో సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అంజన్‌ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలను అధికారులు గుర్తించారు. అయితే బీజేపీ అభ్యర్థి, అతని బంధువుల నివాసల్లో పోలీసులే డబ్బులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సోదాలపై సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆ పార్టీ శ్రేణులు అంజన్‌రావు ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు, రఘునందన్ రావుకు నడుమ తీవ్ర వాద్వాదం చోటు చేసుకుంది. ఓ సమయంలో తీవ్ర తోపులాట జరగడంతో రఘునందన్‌ సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఇప్పటికీ ఆందోళన కొనసాగుతుండడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఈ విషయం తెలుసుకుని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు కావడంతో ఆయన గట్టిగా కేకలు వేయడంతో గట్టిగా కేకలు పెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
Published by: Nikhil Kumar S
First published: October 26, 2020, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading