Home /News /politics /

Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన అమరావతి: మహిళలను అవమానించడం బాధాకరం: పవన్

Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన అమరావతి: మహిళలను అవమానించడం బాధాకరం: పవన్

అమరావతి మహిళల ఆందోళన

అమరావతి మహిళల ఆందోళన

అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. కనక దుర్గమ్మ గుడికి పాదయాత్రగా వెళ్లాలి అనుకున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇంకా చదవండి ...
    ఏపీ ప్రభుత్వం తీరుపై జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున అమరావతి మహిళలపై అంత దారుణంగా వ్యవహరించడం కలచివేసిందని బాధపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని మహిళలు పోరాడుతున్నారని.. అయితే వారు కనకదుర్గమ్మను దర్శనం చేసుకొనేందుకు వెళ్లడం‌ నేరమా అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అడ్డుకొని లాఠీలు ఝుళిపించడం దారుణమన్నారు. అరెస్టులు చేసిన విధానం అవమానకర రీతిలో ఉందని పవన్‌ మండిపడ్డారు. మహిళలను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్‌ కోరారు.

    అంతకుముందు అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. సచివాలయ ఉద్యోగులను మహిళా రైతులు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో మందడం జంక్షన్‌కు మహిళా రైతులు తరలివచ్చారు. ఉద్యోగులను అడ్డుకున్న మహిళలను పోలీసులను పక్కకు లాగిపడేశారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళలకు మధ్య చాలాసేపు తోపులాట జరిగింది. కొంతమంది పోలీసులు బలవంతంగా లాగేయడంతో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ విషయం తెలియడంతో రాజధాని మహిళలు భారీగా అక్కడకు చేరుకుని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.

    ఉదయం అమరావతి నుంచి దుర్గమ్మ దర్శనానికి మహిళా రైతులు బయల్దేరారు. వారిని మందడం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగడంతో.. ఉద్రిక్తత కొనసాగింది. మొదట సచివాలయ ముట్టడికి మహిళలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా భారీగా బలగాలను మోహరించారు. అంతకుముందు కొందరు మహిళను మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని మహిళా రైతులు పాదయాత్రగా విజయవాడ మొదట బయలుదేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

    విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదని మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని వస్తామని చెప్పినా పోలీసులు వినలేదు.  తెల్లవారు జామునుంచే రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చాలామంది మహిళలను అసలు ఇళ్ల నుంచి బయటకు రాకుండానే అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ మహిళా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అమరావతి గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

    పోలీసులు, ప్రభుత్వం తీరుకు నిరసనగా రాత్రి వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజున అమరావతి రాజధానిలో మహిళల మీద ఘోరంగా జరిగిన దాడులకు నిరసనగా కృష్ణాయ పాలెం గ్రామంలో కాగడాలతో నిరసన తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Amaravathi, Andhra Pradesh, Ap new, AP News, AP Politics, Womens day 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు