గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్..

హైకమాండ్ పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్ గాంధీ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: November 8, 2019, 12:10 PM IST
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశంలో నోట్ల రద్దు జరిగి మూడేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.హైకమాండ్ పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్ గాంధీ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరాలని నిర్ణయించారు. అయితే పోలీసులు వారికి అడ్డుపడటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్‌భవన్ వద్దకు వెళ్తామని.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు వినతి పత్రం అందజేస్తామని చెబుతున్నారు.

కాంగ్రెస్ నేతల ముట్టడి పిలుపుతో రాజ్‌భవన్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్ ర్యాలీ గురించి ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అవగాహన రాహిత్యంతో ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు,జీఎస్టీ అమలు నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను పతనం చేశాయని ఆరోపించారు. బీజేపీ ఆర్థిక విధానాల కారణంగా దేశంలో జీడీపీ పడిపోయిందని.. విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయని ఆరోపించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలు కూడా మూతపడే దుస్థితి నెలకొందన్నారు. ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రియల్ ఎస్టేట్ రంగాలు కుదేలవుతుండటతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆరోపించారు.

First published: November 8, 2019, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading