పోలవరంపై హైకోర్టు 'స్టే'.. తాత్కాళికంగా నిలిచిపోనున్న పనులు..

గత ప్రభుత్వం నవయుగ కంపెనీకి కట్టబెట్టిన పోలవరం హైడల్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని సీఎం జగన్ రద్దు చేశారు.రివర్స్ టెండరింగ్‌లో ఆ ఒప్పందాన్ని మెగా సంస్థకు అప్పగించారు.

news18-telugu
Updated: November 8, 2019, 12:54 PM IST
పోలవరంపై హైకోర్టు 'స్టే'.. తాత్కాళికంగా నిలిచిపోనున్న పనులు..
పోలవరం ప్రాజెక్టు
  • Share this:
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమ ఒప్పందాన్ని రద్దు చేయడంపై నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.నవయుగ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి హైడల్ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే పనులు నిలిచిపోతే అన్ని విధాలుగా నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మళ్లీ వరదలు మొదలైతే పనులు చేపట్టడం కష్టమవుతుందని కోర్టుకు తెలిపారు. కోర్టు మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు. మరో 15 రోజులు పనులు నిలిచిపోయినా పెద్దగా నష్టమేమీ ఉండదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మొత్తం మీద హైకోర్టు ఆదేశాలతో పోలవరం పనులు తాత్కాళికంగా నిలిచిపోనున్నాయి.

కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలన్నింటిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అవకతవకలు జరిగినట్టు తేలిన ఒప్పందాలన్నింటిపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం నవయుగ కంపెనీకి కట్టబెట్టిన పోలవరం హైడల్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని రద్దు చేశారు.రివర్స్ టెండరింగ్‌లో ఆ ఒప్పందాన్ని మెగా సంస్థకు అప్పగించారు. గత శుక్రవారమే మెగా సంస్థ స్పిల్‌వే పనులు కూడా ప్రారంభించింది. ఇలాంటి తరుణంలో నవయుగ కోర్టును ఆశ్రయించడంతో స్టే తప్పలేదు.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>