Tammineni Seetharam: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: October 8, 2020, 6:20 PM IST
Tammineni Seetharam: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుత రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హితవుపలికింది. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవాలని, అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని హెచ్చరించింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా నెలకొనలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలపై మీడియా, సోషల్‌ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. స్పీకర్‌ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారా? బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా.. తిరుపతి కొండపై మీడియా ముందు స్పీకర్‌ ఆ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అయితే సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని పిటిషన్ లో ప్రస్తావించారు. న్యాయవ్యస్థపై విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం తగదని స్పీకర్ కామెంట్ చేశారు. కోర్టులు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని ప్రశ్నించారు. పాలనా పరమైన వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకునేటప్పుడు చట్ట సభలు ఎందుకు అని స్పీకర్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను ధిక్కరించి, అప్రతిష్టపాల్జేసి అవమానించడమే అని పిటిషన్ లో రమేష్ నాయుడు పేర్కొన్నారు.

ap highcourt,andhra pradesh highcourt,pending cases in ap highcourt,pending cases in ap,parimal nathwani,ap news,ap politics,ఏపీ హైకోర్టు,ఏపీలో పెండింగ్ కేసలు ఎన్నంటే..? పరిమల్ నత్వానీ
ఏపీ హైకోర్టు


దీంతో పాటు కోర్టుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకో మౌనం వహిస్తున్నారని, ఒకవేళ ఆయన మౌనం బద్ధలైతే ప్రళయం తప్పదని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ఏపీ కోర్టులు ఇస్తున్న తీర్పులను బాధతోనే అంగీకరిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో ఏపీలోని కోర్టులు అనుసరిస్తున్న తీరు, విధానాలపై ప్రజలు, మేధాలువు చర్చించాలని స్పీకర్ కోరారు. ఒకవేళ వైసీపీ నిర్ణయాలు తప్పయితే ప్రజలే ఓడిస్తారని గతంలో స్పీకర్ వ్యాఖ్యానించారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు వస్తున్నాయి. గతంలో కూడా వచ్చాయి. దీంతో కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా హైకోర్టు జడ్జిల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి పెనుదుమారాన్ని సృష్టించాయి. ఓ రకంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రతిపక్షంగా మారిందనే వాదన సోషల్ మీడియా వేదికగా జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని చేసిన కామెంట్లు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు హైకోర్టు వాటిపై స్పందించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 8, 2020, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading