ఓటరు లిస్టులో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16న ఈ కేసు విచారణను చేపట్టనుంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ విధుల్లో తాము తలదూర్చలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొంతకాలంగా ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న మర్రి శశిధర్ రెడ్డి... ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓటరు జాబితాలో అవకతవకలను సరి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతోందని చెబుతూ వస్తున్నారు.
ఎన్నికల కమిషన్ తీరుపై మొదటి నుంచి విమర్శలు చేస్తున్న మర్రి శశిధర్ రెడ్డి... పలువురు ఎన్నికల అధికారులు టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు జోక్యంతోనే ఈ విషయంలో తమకు న్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.