ఆంధ్రప్రదేశ్లో మూడునెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఉమ్మడి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుడా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తోందని.. అందులో కూడా స్పెషల్ ఆఫీసర్లుగా దిగువస్థాయి అధికారులను నియమిస్తోందంటూ కొందరు మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గ్రామాల్లో సర్పంచ్ల పాలన ఈ ఏడాది ఆగస్ట్1న ముగిసింది. అప్పటి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఒకవేళ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ ప్రభావం సాధారణ ఎలక్షన్స్పై పడుతుందన్న ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేదు. అయితే, తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్పై ఈనెల 12న హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ రోజు నుంచి మూడు నెలల్లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఇప్పుడు ఏపీలో కూడా అదే తరహా తీర్పు చెప్పింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.