వైఎస్. వివేకా హత్యపై ఏప్రిల్ 15 వరకూ నేతలు మాట్లాడవద్దు...హైకోర్టు ఆదేశం...

ఇదిలా ఉంటే వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కేసు విచారణను ఏప్రిల్ 15వరకూ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అలాగే వివేకా హత్య కేసుపై ఏప్రిల్ 15 వరకూ రాజకీయ నేతలు ఎవరూ మాట్లాడవద్దని నేతలను న్యాయస్థానం ఆదేశించింది.

news18-telugu
Updated: March 29, 2019, 7:47 PM IST
వైఎస్. వివేకా హత్యపై ఏప్రిల్ 15 వరకూ నేతలు మాట్లాడవద్దు...హైకోర్టు ఆదేశం...
వైఎస్ వివేకానంద రెడ్డి
  • Share this:
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు సంచలన ఆదేశాలను వెలువరించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ వివేకా హత్యపై రాజకీయ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, వివేకానంద రెడ్డి హత్యపై రాజకీయ నేతలు ఏప్రిల్ 15వ తేదీ వరకూ ఎలాంటి ప్రకటనలు చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. అలాగే హత్య కేసు దర్యాప్తుపై సిట్ విచారణ యథావిధిగా కొనసాగించుకోవచ్చని హై కోర్టు సూచించింది. అలాగే సిట్ అధికారులు కూడా కేసు వివరాలు బహిర్గతం చేయవద్దని కోర్టు ఆదేశాల్లో తెలిపింది.

ఇదిలా ఉంటే వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కేసు విచారణను ఏప్రిల్ 15వరకూ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అలాగే వివేకా హత్య కేసుపై ఏప్రిల్ 15 వరకూ రాజకీయ నేతలు ఎవరూ మాట్లాడవద్దని నేతలను న్యాయస్థానం ఆదేశించింది.

ఇది కూడా చూడండి :-

దేశానికి కొత్త ప్రధాని ఖాయం... జగన్‌కు కేసీఆర్, బీజేపీ సపోర్ట్... సీఎన్ఎన్ న్యూస్18 ఇంటర్వ్యూలో చంద్రబాబు

First published: March 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>