Home /News /politics /

HIGH COURT ORDERS MINISTER KODALI NANI AND SEC TO FILE MORE VIDEOS REGARDING PRESS MET NOT SATISFIED WITH SUBMITTED VIDEO FOOTAGE HERE ARE THE DETAILS PRN

SEC vs Kodali Nani: కొడాలి నాని పిటిషన్ పై కొనసాగుతున్న సస్పెన్స్... విచారణ వాయిదా

నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)

నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Andhra Pradesh SEC) కు మంత్రి కొడాలి నానికి (Minister Kodali Nani) మధ్య వివాదం కొనసాగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మంత్రి కొడాలి నానికి మధ్య వివాదం కొనసాగుతోంది. తనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ కొడాలి నాని వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు సమర్పించిన వీడియో టేపులతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు. దీంతో పూర్తిస్థాయి వీడియో టేపులను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. ఐతే ఈ కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన న్యాయస్థానం.. కోర్టుకు సహాయపడేందుకు అమిస్ క్యూరిని నియమిస్తున్నట్లు తెలిపింది. అమిస్ క్యూరీగా సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని తెలిపింది.

    మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దానిపై మంత్రి వివరణ సరిగా లేకపోవడంతో ఆయన్ను మీడియాతో మాట్లాడకుండా నిషేధించడమే కాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులును ఆదేశించారు. దీనిపై కొడాలి నాని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయగా.. ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడిన ప్రతి అంశాన్ని పరశీలించిన తర్వాతే ఎస్ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాల్న అభ్యర్థనపై తగు నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. కొడాలి నాని ప్రెస్ మీట్ లో ఎస్ఈసీని, ఎన్నికల కమిషనర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లు ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

    ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజ్ తో పాటు పూర్తి వివరాలతో రావాలని న్యాయవాది జస్టిస్ డీవీఎస్ సోమయాజులు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. అటు ఎస్ఈసీ.. ఇటు కొడాలి నాని వీడియో ఫుటేజ్ లు సమర్పించగా.. రెండింటిలోనూ స్పష్టత లేదంటూ కోర్టు విచారణను వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కూడా వీడియో టేపులను బుధవారం కోర్టు ముందుంచాలని ఆదేశించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap election, AP High Court, Ap local body elections, AP News, Gram Panchayat Elections, Kodali Nani, Nimmagadda Ramesh Kumar, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు