ఏపీలో జగన్ నిర్ణయంపై హైకోర్టు విచారణ

ఏపీ ప్రభుత్వం మద్యాన్ని దశల వారిగా నియత్రిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో ఉన్న అన్ని బార్ లైసెన్స్ లు ప్రభుత్వం రద్దు చేసింది.

news18-telugu
Updated: December 3, 2019, 3:46 PM IST
ఏపీలో జగన్ నిర్ణయంపై హైకోర్టు విచారణ
ఏపీ సీఎం జగన్, ఏపీ హైకోర్టు
  • Share this:
బార్ లైసెన్సుల రద్దుపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది. ఆరునెలల ముందే లైసెన్సుల రద్దుపై హైకోర్టును ఆశ్రయించారు బార్ల యజమానులు. లైసెన్స్ గడువు ఉన్నా ముందుగా ఎలా రద్దు చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొన్ని బార్ లైసెన్సులకు 2020 వరకూ ఉన్న గడువు ఉన్నా కూడా అన్ని బార్ లైసెన్సులను ఆకస్మికంగా రద్దు చేసింది ప్రభుత్వం.ఈ నెల 7 కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. ఈ నెల 16 కల్లా తమ స్పందనతో కౌంటర్ వేయాలని బార్ల యజమానులకు ఆదేశించారు. కోర్టు విచారణ నేపథ్యంలో వచ్చే నెల 7న జరగాల్సిన లైసెన్సుల డ్రా వాయిదా వేసుకున్నట్లు కోర్టుకు తెలిపింది ఏజీ. డిసెంబర్ 23కు కేసు విచారణ వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం మద్యాన్ని దశల వారిగా నియత్రిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో ఉన్న అన్ని బార్ లైసెన్స్ లు ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో బార్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.


First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>