• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • HIGH COURT HALTS AP SEC NIMMAGADDA RAMESH KUMARS E WATCH APP TILL FEBRUARY 9TH BA

AP Panchayat Elections: నిమ్మగడ్డకు షాక్.. e-watch appపై హైకోర్టు కీలక నిర్ణయం

AP Panchayat Elections: నిమ్మగడ్డకు షాక్.. e-watch appపై హైకోర్టు కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

గా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొచ్చిన E-Watch App ను హైకోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. ఈ వాచ్ యాప్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9 వరకు యాప్‌ను అమల్లోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రోజు రోజుకు, గంట గంటకూ ట్విస్టులు వస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొచ్చిన E-Watch App ను హైకోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సీ విజిల్ యాప్ ఇప్పటికే ఉండగా, మళ్లీ కొత్తగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో యాప్ తీసుకురావడం సరికాదని, దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ఈ వాచ్ యాప్ మీద విచారణ జరిపింది. దీనికి భద్రతా పరమైన అనుమతులు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనికి మరో 5 రోజుల్లో భద్రాపరమైన అనుమతులు వస్తాయని వాదించారు. దీంతో ఈ వాచ్ యాప్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9 వరకు యాప్‌ను అమల్లోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార వైసీపీకి షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా, నిమ్మగడ్డ ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగిన చిత్తూరు, గుంటూరు జిల్లాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగ్ లో పెట్టాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై ఎలాంటి ప్రకటన చేయరాదని గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏకగ్రీవమైన పంచాయతీలపై పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్ కు పంపాలన్న ఆయన.. నివేదికలు పరిశీలించిన అనంతరం అవసరమైన చర్యలు తీసకుంటామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్న ఎస్ఈసీ.. తన పర్యటన విజయవంతమైందని ప్రకటించారు. అలాగే ఎన్నికల సందర్భంగా కొవిడ్ నివారణ చర్యలు పటిష్టంగా ఉన్నాయన్నారు.

    మేనిఫెస్టో ఉపసంహరించుకోవాలని టీడీపీకి లేఖ

    ఇక పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను రద్దు చేశారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని, టీడీపీ అధినేత మేనిఫెస్టోను ప్రకటించడం, ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ఈసీ కి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీపీని ఎస్ఈసీ కోరింది. అయితే, టీడీపీ నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేస్తూ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల సమయంలో దాన్ని ప్రచారం చేయడం కానీ, పంచడం కానీ చేయరాదంటూ టీడీపీకి ఎస్ఈసీ లేఖ రాశారు.

    మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖపై టీడీపీ స్పందించింది. ఎన్నికల కమిషనర్ సూచన మేరకు తాము మేనిఫెస్టోను ఉపసంహరించుకుంటున్నట్టు టీడీపీ ప్రకటించింది. అయితే, ఓ రాజకీయ పార్టీగా తాము  ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నామో తెలియజేసే హక్కు తమకు ఉంటుందని చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: