తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి... మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించినట్లైంది.

news18-telugu
Updated: October 22, 2019, 12:47 PM IST
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి... మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
news18-telugu
Updated: October 22, 2019, 12:47 PM IST
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది.దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించినట్లైంది. తెలంగాణలోమున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నింటిని కోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికలపై గత మూడు నెలల నుంచి హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది తీర్పును ప్రకటిస్తామని గతంలోనే హైకోర్టు చెప్పింది. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు మంగళవారం తుది తీర్పు ఇచ్చింది.

ఇవికూడా చూడండి:
పాట పాడుతూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పోలీస్First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...