ఏపీ సర్కారుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు

ప్రతీకాత్మక చిత్రం

గ్రానైట్‌ క్వారీల యజమానులకు నోటీసుల జారీ విషయమై ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది.

  • Share this:
    గ్రానైట్‌ క్వారీల యజమానులకు నోటీసుల జారీ విషయమై ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులకు రూ. 2500 కోట్ల జరిమానా విధిస్తూ గనులు, భూగర్భ శాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. అయితే లాక్‌డౌన్‌తో గ్రానైట్‌ క్వారీలు మూతపడిన నేపథ్యంలో తిరిగి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో ఓ క్వారీ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. లాక్‌డౌన్‌ వల్ల మొత్తం పరిశ్రమ మూతపడిన నేపథ్యంలో నోటీసులు ఇవ్వడాన్ని ఆ పిటిషన్‌లో సవాల్‌ చేశారు. దీన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారించింది. సదరు గ్రానైట్‌ క్వారీ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తి ‘ఇదే విషయంలో గతంలో ఒక తీర్పు ఇచ్చాం, పైగా ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూసివేసి ఉంది. ఇప్పుడు జరిమానాలు విధించడం ఏంటి?’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ నోటీసులకు ఇప్పటికిప్పుడే యజమానులు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసి పరిశ్రమ గాడిలో పడిన తర్వాత విచారణ చేద్దామ ని తేల్చి చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో గ్రానైట్‌ వ్యాపార, అనుబంధ పరిశ్రమలు,వాటిపై ఆధారపడిన కార్మికులకు ఈ నిర్ణయం కాస్తంత ఊరటనిచ్చింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: