సచివాలయ భవనం కూల్చొద్దు... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

సచివాలయ భవనం, ఎర్రమంజిల్ కోర్టు కూల్చివేతలపై పాడి మల్లయ్య అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: July 8, 2019, 1:24 PM IST
సచివాలయ భవనం కూల్చొద్దు... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
తెలంగాణ సచివాలయం (File)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎర్రమంజిల్ కోర్టు, సచివాలయ భవనాలు కూల్చొద్దని ఆదేశించింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో కూల్చివేతలు వద్దని పేర్కొంది... కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ తరపు న్యాయవాది మరో 15 రోజు ల సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. అయితే దీనిపై ఇవాళే వాదనలు కొనసాగాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది. సచివాలయ భవనం, ఎర్రమంజిల్ కోర్టు కూల్చివేతలపై పాడి మల్లయ్య అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు