Home /News /politics /

HIGH COURT COMMENTS ON PILL FILED BY CONGRESS LEADER SHRAVAN OVER GHMC ELECTIONS NS

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని పిటిషన్.. హైకోర్టు తీవ్ర వాఖ్యలు

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఫోటో)

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఫోటో)

జీహెచ్ఎంసీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా జీహెచ్ఎంసీలో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని శ్రవణ్‌ తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
    దుబ్బాక ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా జీహెచ్ఎంసీలో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని శ్రవణ్‌ తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయంగా వెనకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు పిటిషనర్ కు స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటీషనర్‌ వాదనను తీవ్రంగా తప్పపట్టింది.

    పదేళ్ల క్రితం సుప్రీంలో తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదని వాఖ్యానించింది. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న ఆఖరి సమయంలో సుప్రీంకోర్టు తీర్పు గుర్తొచ్చిందా? అంటూ న్యాయస్థానం తీవ్రంగా వాఖ్యానించింది. రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేస్తాం కానీ.. ఎన్నికలపై మాత్రం స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీకి హై కోర్టు నోటీసులు జారీచేసింది.

    ఇదిలా ఉంటే దుబ్బాక ఉపఎన్నికల్లో రోటీ మేకర్ గుర్తు తమను దెబ్బ కొట్టిందని టీఆర్ఎస్ నేతుల భావిస్తున్నారు. గతంలోనూ ఆటోను పోలిన ట్రక్కు, ఆటోల గుర్తు కారణంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమి చెందారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పలువురు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. తమ పార్టీ గుర్తు అయిన కారును పోలిన గుర్తుల్ని ఎవరికీ కేటాయించవద్దని కోరారు. ఈ మేరకు మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, పార్టీ నేతలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిని కలిశారు. కారును పోలిన గుర్తులను వేరే అభ్యర్థులకు కేటాయించడం వల్ల తమ పార్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఎన్నికల కమిషనర్ కు టీఆర్ఎస్ నేతలు వివరించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad - GHMC Elections 2020, Telangana High Court, Tpcc

    తదుపరి వార్తలు