Home /News /politics /

HIGH COURT CJ PRAVEEN KUMAR MISHRA MADE SENSATIONAL COMMENTS ON AP CAPITAL ISSUE FULL DETAILS HERE PRN

AP Capital Issue: ఏపీ రాజధానిపై త్వరగా తేల్చేస్తాం.. హైకోర్టు సీజే సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వ వాదనకు నో..

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మూడు రాజధానుల అంశం (AP Capitals Issue) మరోసారి తెరపైకి వచ్చింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సోమవారం నుంచి హైకోర్టు (AP High Court) రోజువారీ విచారణను ప్రారంభించింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మూడు రాజధానుల అంశం (AP Capitals Issue) మరోసారి తెరపైకి వచ్చింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సోమవారం నుంచి హైకోర్టు (AP High Court) రోజువారీ విచారణను ప్రారంభించింది. దీంతో ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదికి పైగా ఈ అంశం కోర్టులో నలుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన విచారణ సందర్భంగా నవంబర్ 15 నుంచి రోజువారీ విచారణ చేపడతామన్న కోర్టు.. చెప్పినట్లుగానే చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ మిశ్రా (AP CJ Praveen Kumar Mishra) నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ప్రారంభించింది. దీంతో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లలను సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన 57 పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభమైంది.

    ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు విపినిస్తూ తిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలని కోరారు. బెంచ్ లో ఉన్న జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణను బెంచ్ నుంచి తప్పించాలని ప్రభుత్వం వాదించింది. ఐతే ప్రభుత్వ వాదనను ధర్మాసనం తొసిపుచ్చింది. రైతుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ శ్యామ్ దివాస్ వాదనలు వినిపిస్తున్నారు.

    ఇది చదవండి: ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఈ జిల్లాలకు అలర్ట్... తీరాన్ని తాకేది ఇక్కడే..!


    ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రవిణ్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కేసుల విచారణను వేగంగా చేపట్టి పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడినట్లు అనిపిస్తోందని.. రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశం కాబట్టి త్వరగా ముగించేస్తామని ఆయన అన్నారు. ఇందులో కక్షిదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని సీజే అభిప్రాయపడ్డారు.

    ఇది చదవండి: “రాష్ట్రంలో అమ్మకానికో బడి..” జగన్ సర్కార్ పై పవన్ ఫైర్..



    విచారణ త్వరగా ముగిస్తామన్న హైకోర్టు సీజే వ్యాఖ్యలతో రాజధానిపై ఏం జరగబోతుందన్నది చర్చనీయాంశమైంది. 2019 డిసెంబర్లో అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఆమరావతి ప్రాంత రైతులతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లును రద్దూ చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా మండలిలో మాత్రం నెగ్గలేకపోయింది.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు RRR టీమ్... క్లారిటీ ఇచ్చిన దానయ్య... సీఎం జగన్ తో భేటీ...


    మరోవైపు వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు కోర్టుకు వెళ్లారు. రైతులు, రైతు సంఘాలు 57 పిటిషన్లను దాఖలు చేశాయి. కరోనా కారణంగా విచారణలో జాప్యం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తిస్థాయి విచారణ సాధ్యం కాకపోవడంతో రోజువారీ విచారణవైపే హైకోర్టు మొగ్గుచూపింది. రోజువారీ విచారణ ప్రారంభమైన తొలిరోజే సీజే కీలక వ్యాఖ్యలు చేయడంతో రాజధాని అంశంలో కలదలిక వచ్చినట్లైంది.

    ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఈ అవకాశం..


    ఓ వైపు రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. అమరావతి ప్రాంత రైతులు న్యాయస్తానం to దేవస్థానం పేరుతో మహాపాదయాత్రను చేపట్టారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. 45 రోజుల పాటు నిర్వహించే యాత్ర డిసెంబర్ 15న తిరుపతిలో ముగుస్తుంది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని.. అది అమరావతే కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap capital, AP High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు