హోమ్ /వార్తలు /politics /

AP Capital Issue: రాజధాని రైతుల పిటిషన్లపై కొనసాగుతున్న సస్పెన్స్.. గవర్నర్ కోర్టులో బంతి..!

AP Capital Issue: రాజధాని రైతుల పిటిషన్లపై కొనసాగుతున్న సస్పెన్స్.. గవర్నర్ కోర్టులో బంతి..!

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) మూడు రాజధానుల బిల్లును ( 3 Capitals Bill) వెనక్కి తీసుకున్నా.. దీనిపై ఇంకా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కి తీసుకోవడంతో రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ముగించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) మూడు రాజధానుల బిల్లును ( 3 Capitals Bill) వెనక్కి తీసుకున్నా.. దీనిపై ఇంకా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కి తీసుకోవడంతో రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ముగించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. దీనిపై రైతుల తరపున న్యాయవాదులు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఉపసంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకువస్తామని చెప్పిందని లాయర్లు గుర్తు చేశారు ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని.. మాస్టర్ ప్లాన్ కూడా అదే చెబుతుందని వాదించారు. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణను కొనసాగించాలని కోరారు.

బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. ఆయన నుంచి ఆమోదం వచ్చిన తర్వాత రాజధానిపై దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగించాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. చట్టానికి లోబడి అభివృద్ధి చేసేందుకు ప్రతిబంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఐతే ప్రభుత్వ శాఖల తరలింపుపై ఉన్న స్టేటస్ కో ఉత్తర్వులు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది . అనంతరం విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది.

రైతులేమంటున్నారంటే..!

అసెంబ్లీలో సీఎం జగన్.. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని.. మరోసారి అందరి అభిప్రాయాలను గౌరవించేలా సమగ్రమైన బిల్లుతో సభ ముందుకు వస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే..! దీనిపైనే రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటం మూడు రాజధానులకు వ్యతిరేకంగానేనని.. ప్రభుత్వం మళ్లీ అదే ప్రకటన చేయడమేంటని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం చెబుతున్నట్లు ఐతే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత న్యాయబద్ధత లేదని వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వం మూడు మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును వెనక్కి తీసుకునే సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు.. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలు ఇస్తూ బిల్లును మరింత మెరుగు పరుస్తామని సీఎం వెల్లడించారు. ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టిన బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వెళ్లాయి. ఐతే కొంతకాలంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆనారోగ్యంతో బాధపడుతున్నందున బిల్లుల ఆమోదం పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం తర్వాత గెజిట్ విడుదలైన వెంటనే రైతలు పిటిషన్లపై విచారణ కొనసాగించాలా..? లేదా..? అనే దానిపై సస్పెన్స్ వీడనుంది.

First published:

Tags: Andhra Pradesh, Ap capital

ఉత్తమ కథలు