HOME »NEWS »POLITICS »high alert declared in telangana in view of jammu kashmir developments bs

కశ్మీర్‌‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో అలర్ట్..

కశ్మీర్‌‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో అలర్ట్..
చార్మినార్ (File)

‘సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదు.అన్ని ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశాం’ అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

  • Share this:
    జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబురాలు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుతూ ఆనందంలో మునిగిపోయారు. అయితే, కశ్మీర్ సమస్య అత్యంత సున్నితమైనందున హైదరాబాద్‌లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీస్ శాఖ అలర్ట్ ప్రకటించింది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదు.అన్ని ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం’ అని వెల్లడించారు. మరోవైపు, రాచకొండ సీపీ మహేష్ భగవత్ కూడా కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు ఉన్నాయని తెలిపారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:August 05, 2019, 14:48 IST