భారీ జరిమానాలు సరే.. కానీ ఆ విషయం గుర్తుంచుకోండి : సీఎంకు హీరోయిన్ విజ్ఞప్తి

కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ జరిమానాలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు ఆ జరిమానాలకు గగ్గోలు పెడుతున్న పరిస్థితి.

news18-telugu
Updated: September 7, 2019, 2:23 PM IST
భారీ జరిమానాలు సరే.. కానీ ఆ విషయం గుర్తుంచుకోండి : సీఎంకు హీరోయిన్ విజ్ఞప్తి
శృతి రామకృష్ణ
  • Share this:
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రావడంతో.. ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. నిబంధనలు అతిక్రమించే వాహనదారుల జేబులకు భారీ చిల్లు తప్పడం లేదు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముందు అద్వాన్నంగా ఉన్న రోడ్లను సరిచేసి.. ఆ తర్వాత జరిమానాలు బాదండి అని సోషల్ మీడియాలో మొరపెడుతున్నారు.తాజాగా ఇదే విషయంపై కన్నడ హీరోయిన్ శృతి రామకృష్ణ సీఎం యడియూరప్పకు ట్విట్టర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు.'భారీ జరిమానాలు విధించే ముందు మంచి రోడ్లను నిర్మించండి. సామాన్యులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో జరిమానాలు కడుతున్నారని గుర్తుంచుకోండి. వాళ్ల జీవితాలతో ఆడుకోకండి.' అని సీఎంకు శృతి ట్విట్టర్‌లో కాస్త ఘాటుగానే విజ్ఞప్తి చేసింది.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading