Rajinikanth: హీరో రజనీకాంత్ కు హైకోర్టు షాక్.. ఇంకో సారి అలా చేయొద్దంటూ వార్నింగ్

రజనీకాంత్(file photo)

Hero Rajinikanth: ప్రముఖ హీరో, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కోర్టులో చుక్కెదురైంది. సర్కారుకు కట్టాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం సరికాదని న్యాయస్థానం వాఖ్యానించింది. ఇలా చేస్తే జరిమానా విధించాల్సి వస్తుందంటూ హైకోర్టు తలైవాను తీవ్రంగా హెచ్చరించింది.

  • Share this:
    ప్రముఖ హీరో, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఆయనను మద్రాస్ హైకోర్టు మందలించింది. ఇలా సర్కారుకు కట్టాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం సరికాదని వాఖ్యానించింది. ఇలా చేస్తే జరిమానా విధించాల్సి వస్తుందంటూ న్యాయస్థానం తలైవాను తీవ్రంగా హెచ్చరించింది. చెన్నైలోని కొడంబాకం ప్రాంతంలో రజనీకాంత్ కు ఓ కల్యాణ మండపం ఉంది. దాని పేరు రాఘవేంద్ర కల్యాణ మండపం. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దానిని మార్చి 24 నుంచి మూసివేశారు. ఇటీవల గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆ కల్యాణ మండపానికి సంబంధించి పన్ను చెల్లించాలంటూ రజనీకాంత్ కు నోటీసులు జారీ చేసింది. ఆస్తి పన్ను కింద మొత్తం రూ. 6.5 లక్షలు చెల్లించాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

    అయితే కరోనా నేపథ్యంలో అధికారుల ఆదేశాలతో మూసి ఉన్న ఫంక్షన్ హాల్ కు పన్ను ఎలా కడతారన్నది రజనీకాంత్ వాదన. ఈ నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులపై రజనీకాంత్ మద్రాస్ హైకోర్టును వెళ్లారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 24 నుంచి ఆ కల్యాణ మండపం మూసి వేసి ఉందని.. ఆ రోజు నుంచి ఆ కల్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని రజనీ కోర్టుకు తెలిపారు. దీంతో తాను ఆ పన్నును చెల్లించలేనని రజనీ కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ హీరో రజనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారుకు చెల్లించాల్సిన ట్యాక్స్ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం సరికాదంటూ మందలించారు. ఇలా చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇదిలా ఉంటే కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజనీ తరఫు లాయర్ కోర్టును కోరారు.

    అయితే రజనీని ఇబ్బంది పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నిస్తుందోని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నాను. అందులో భాగంగానే రజనీ ఫంక్షన్ హాల్ కు భారీగా పన్ను విధించిందని మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో రజనీ తమకు మద్దతు ప్రకటించేలా లొంగదీసుకోవడానికి అధికారులను ప్రయోగిస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోర్టు వాఖ్యలపై తలైవా ఎలా స్పందిస్తారో చూడాలి.
    Published by:Nikhil Kumar S
    First published: