• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • HERO MAHESH BABU PHOTO MISPLACED IN KURNOOL JAGANANNA VIDYA DEEVENA LIST SB

మహేష్ బాబుకు జగన్ దీవెన... ఆశ్చర్యపోతున్న అభిమానులు

మహేశ్ బాబు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Mahesh Babu: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీ అనే విద్యార్థికి అధికారులు ఇష్యూ చేసిన విద్యా దీవెన కార్డులో మహేష్ బాబు ఫోటో చూసి కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.

  • Share this:
    ఏపీలో మొన్న వెంకటేష్‌కు ఓటర్ ఐడీ కార్డు వచ్చినట్లే... ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు జగనన్న దీవెన కార్డు జారీ చేశారు అధికారులు. కర్నూలు జిల్లాలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో... విద్యార్థుల ఫోటోలకు బదులు మహేష్ బాబు.. ఫోటును వాడారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీ అనే విద్యార్థికి అధికారులు ఇష్యూ చేసిన విద్యా దీవెన కార్డులో మహేష్ బాబు ఫోటో చూసి కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. పత్తికొండలోనూ కూడా ఓ విద్యార్థికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఎమ్మిగనూరులో విద్యార్థిని లక్ష్మీ ఫోటోకు బదులుగా మహేష్ బాబు ఫోటోను ప్రింట్ చేశారు అధికారులు. దీంతో అధికారులను విద్యార్థుల కుటుంబసభ్యులు ప్రశ్నించగా... ఈ విషయంలో తమ తప్పేం లేదన్నారు. సచివాలయ ఉద్యోగులదే తప్పని తమకెలాంటి సంబంధం లేదని తెలిపారు. తాము చేసిన తప్పును కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

    కర్నూలు జిల్లలోనే గత కొన్ని రోజుల క్రితం హీరో వెంకటేష్ కూడా ఇలాగే ఓటర్ లిస్ట్‌లో ప్రత్యక్షమయ్యింది. కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ జాబితాలో హీరో వెంకటేష్ ఫొటో ఉంది. కర్నూలులోని 31వ వార్డులో ఓటరు పేరు రాణి కూమరొలూ అని ఉంది. తండ్రి / భర్త పేరు బాలు కూమరొలూ. ఇంటి నెంబర్ 83/54a. వయసు 20 సంవత్సరాలు. లింగము : స్త్రీ అని రాసి ఉంది. అయితే, పక్కన ఫొటో మాత్రం వెంకటేష్ ఫొటో ఉంది.
    Published by:Sulthana Begum Shaik
    First published: