వైఎస్ జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ మామ భేటీ... వైసీపీలో చేరతారా?

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ వీడతారో తెలియని సందిగ్ధావస్థలో పడిపోయింది అధికార టీడీపీ. ఈ నేపథ్యంలోనే అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: February 18, 2019, 2:46 PM IST
వైఎస్ జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ మామ భేటీ... వైసీపీలో చేరతారా?
నార్నె శ్రీనివాసరావు, జూ.ఎన్టీఆర్ దంపతులు ఫైల్
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. మహానటుడు నందమూరి తారక రామరావు ఫ్యామిలీ నుంచి వచ్చిన నట వారసుడిగా... ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం కూడా చేసి.. రాజకీయాల్లోనూ తన సత్తా చూపించాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ రైటర్.. మొదట్నుంచీ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకే మద్దతు ప్రకటించారు. అయితే, కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగినా... ఈ హీరో ఆసక్తి చూపలేదు.

తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు.. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో జగన్‌తో ఆయన భేటీ కావడం సంచలనం రేపుతోంది. నార్నె శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రణతిని.. 2011లో జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఎపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ మద్దతుదారుడైన జూనియర్ ఎన్టీఆర్ మామ.. జగన్‌ను కలవడం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశానని నార్నె చెబుతున్నప్పటికీ.. తాజాగా అధికార పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో వీరి భేటీ పొలిటికల్‌గా హీట్‌ను పెంచుతోంది.

అయితే, నార్నె మాత్రం జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనను కలిశాను తప్ప వేరే చర్చలేమీ జరగలేదని చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ నార్నె శ్రీనివాసరావు, జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగినా అలా జరగలేదు. మరి ఈసారి ఏం జరుగుతోంది చూడాలి.
First published: February 18, 2019, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading