టీడీపీ కోసం బాలకృష్ణను సీన్‌లోకి దించుతున్న చంద్రబాబు

తెలుగుదేశం పరిస్థితిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద కుమార్ గౌడ్ , రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై చర్చించారు.

news18-telugu
Updated: October 7, 2019, 12:20 PM IST
టీడీపీ కోసం బాలకృష్ణను సీన్‌లోకి దించుతున్న చంద్రబాబు
చంద్రబాబు ,బాలకృష్ణ
news18-telugu
Updated: October 7, 2019, 12:20 PM IST
టీడీపీ కోసం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని బతికించేందుకు ఆయన సైతం నడుం బిగించారు. తాజాగా తెలంగాణ హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు నందమూరి బాలకృష్ణ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గానికి టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీ చేస్తున్నారు.

మరోవైపు హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారం, తెలుగుదేశం పరిస్థితిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద కుమార్ గౌడ్ , రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బాలయ్య పర్యటన, ప్రచారం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ ఆదివారం నుంచి హుజూర్ నగర్‌లో బాలకృష్ణ పర్యటన సాగుతుందని, ఐదు నుంచి ఆరు రోజులు ఆయన ప్రచారం చేయనున్నట్లు సమాచారం. హుజూర్ నగర్ స్థానాన్ని ఎలా అయినా తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీజేపీలు కూడా పక్కా వ్యూహరచనతో ముందుకు పోతున్నాయి.

ఇవికూడా చదవండి:

తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సుల్లో నిలువు దోపిడీFirst published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...