• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • HERE IS THE REAL STORY OF IAS OFFICER WHO DEVELOPED HIS OWN VILLAGE AS A SARPANCH GIVE INSPIRATION TO YOUTH AHEAD OF ANDHA PRADESH PANCHAYAT ELECTIONS PRN GNT

Andhra Pradesh: సొంతూరి కోసం సర్పంచ్ గా మారిన కలెక్టర్.. ఎక్కడో తెలుసా..

Andhra Pradesh: సొంతూరి కోసం సర్పంచ్ గా మారిన కలెక్టర్.. ఎక్కడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

AP Panchayat Elections: ఆయనో రిటైర్డ్ ఐఏఎస్.. తలచుకుంటే ఏ రాజకీయ పార్టీలో చేరి గట్టిగా లాబీయింగ్ చేస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోవచ్చు. కానీ సొంతూరికి సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అవతారమెత్తారు.

  • Share this:
    ఆయనో రిటైర్డ్ ఐఏఎస్.. తలచుకుంటే ఏ రాజకీయ పార్టీలో చేరి గట్టిగా లాబీయింగ్ చేస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోవచ్చు. కానీ పుట్టిన ఊరిపై మమకారం, సొంతవాళ్లకు సేవచేయాలనే తపన ఆయన్ను పంచాయతీ ఎన్నికల వైపు నడిపించింది. సర్పంచ్ గా ఎన్నికై తన గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆయన.., కుళ్లు రాజకీయాలను భరించలేక తన పదవినే వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడు పేటకు చెందిన తాళ్వాయిపాటి మునిరత్నం.., నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. 1982లో రిటైర్ అయ్యారు. విధి నిర్వహణలో సిన్సియర్ గా వ్యవహరించిన మునిరత్నం.. అప్పటి తన సొంతగ్రామమైన నాయుడుపేటను అభివృద్ధి చేయాలని భావించారు. అనుకుందే తడవుగా 1987లో నాయుడుపేట సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

    మునిరత్నం సర్పంచ్ అయిన వెంటనే నాయుడు పేట రూపురేఖలు మారిపోయాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిగా తనకున్న పరిచయాలతో నాయుడు పేటకు భారీగా నిధులు తీసుకొచ్చారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొన్నిసార్లు నిధుల రాక ఆలస్యమైనా, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా తన సొంతడబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు ఇళ్లు కట్టించాలని బృహత్తర ఆశయంతో తన సొంత డబ్బుతో 20 ఎకరాల పొలం కొనుగోలు చేసి అక్కడ పేదలు మరియు బీడీ కార్మికులకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. అంతేకాదు ఆ కాలనీలో రాష్ట్రంలోని మొట్టమొదటి సిమెంట్ రోడ్డు నిర్మించారు.

    అలాగే నాయుడుపేటలో జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్, ప్రస్తుత మున్సిపల్ భవనం, NJR షాపింగ్ కాంప్లెక్స్ వంటివి ఆయన హయాంలో రూపుదిద్దుకున్నవే. నాయుడుపేటను అభివృద్ధికి చిరుమానాగా నిలిపిన మునిరత్నం తాను పనిచేసిన సమయంలో ఒక్కరూపాయి కూడా జీతంగా తీసుకోలేదు. మునిరత్నం హయాంలో నాయుడు పేటకు ఉత్తమ గ్రామపంచాయితీగా గుర్తింపు లభించడం మరో విశేషం.

    నిస్వార్ధంగా పనిచేసే నాయకులకు ఎక్కడైనా రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవు. మునిరత్నంకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయన ముక్కుసూటి తనం, నిజాయతీ నచ్చని కొందరు రాజకీయ నాయకులు ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేయడంతో విసిగి వేసారి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. మునితర్నం హయాం తర్వాత నాయుడు పేట నగర పంచాయతీగా, మున్సిపాలిటీగా మారినా ఇప్పటికీ ఆయన చేసిన అభివృద్ధే ప్రజలకు కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా యువత స్వర్గీయ మునిరత్నం లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ముందుకురావాలని ప్రజాసంఘాలు పిలుపునిస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published: