Home /News /politics /

HERE IS THE LIST OF UNANIMOUS GRAMA PANCHAYATS IN ANDHRA PRADESH SO FAR CHITTOORE DISTRICT REGISTERED MAXIMUM NUMBER OF UNANIMOUS PANCHAYATS IN STATE PRN

AP Panchayat Elections: ఏపీలో ఏకగ్రీవమైన పంచాయతీలు ఇవే... ఏ జిల్లాలో ఎన్నో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) హడావిడి కొనసాగుతోంది. పోలింగ్ సంగతి అటుంచితే ఏకగ్రీవాలపైనే అందరి దృష్టి నెలకొంది.

    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. పోలింగ్ సంగతి అటుంచితే ఏకగ్రీవాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టడం, బెదిరంపులు, ఘర్షణలు వంటివి చోటు చోసుకోవడంతో ప్రతి చోటా ఏకగ్రీవాలపైనే చర్చ జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో ఏళ్ల నుంచి ఉన్న ఆనవాయతీలను కొనసాగిస్తూ ఎన్నికలు ఏకగ్రీవంకాగా.. కొన్ని చోట్ల బుజ్జగింపులు, ప్రలోబాలతో పంచాయతీలను ఏకగ్రీవం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,249 గ్రామపంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగనుండగా అందులో 452 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96 అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఈనెల 9న ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

    జిల్లాల వారీగా ఏకగ్రీవాలైన గ్రామ పంచాయతీలు ఇవే:

    • చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం

    • గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం

    • కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం

    • వైఎస్‌ఆర్‌ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం

    • పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం

    • శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం

    • విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం

    • తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం

    • కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం

    • ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం

    • నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం

    • అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం


    ఇది చదవండి: ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన.. వైసీపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్లేనా..?



    ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను పెంచింది. రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2001 నుంచి 5000లోపు జనాభా ఉండే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, 5001 నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షల నగదు ప్రోత్సాహం అందనుంది. అలాగే 10వేల కన్నా అధిక జనాభా ఉన్న పంచాయతీలకు .రూ.20 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐతే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ ప్రకటన ఇవ్వడంపై ఎస్ఈసీ సమాచార శాఖను వివరణ కోరింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Local body elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు