Home /News /politics /

HERE IS THE DETAILS ABOUT RESERVATIONS PROCESS FOR PANCHAYAT ELECTIONS IN ANDHRA PRADESH PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల (Reservations) అంశం ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా అన్నింటికంటే ముందు చర్చకు వచ్చే అంశం రిజర్వేషన్. ఏగ్రామంలో ఎవరు పోటీ చేయాలని.., ఏమండలాన్ని ఎవరికి కేటాయించారనే అంశంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవే తొలి పంచాయనీ ఎన్నికలు కావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈసారి రిజర్వేషన్లను అధికారులు ఆయా సామాజిక వర్గాల జనాభా, గ్రామ పంచాయతీల సంఖ్య ఆధారంగా చేపట్టారు.

    రిజర్వేషన్ ప్రక్రియ ఇలా..!
    ఈ ఎన్నికలు నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికలు అయినందున గత ఎన్నికలను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ స్థానాలకు జనాభా ప్రాతిపదికన,. బీసీ స్థానాలకు ఓటర్ల ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టారు. మండలాల వారిగా చూస్తే ఎస్సీ, ఎస్టీ జనాభాను మండల జనాభాతో భాగించి మండలంలో ఉన్న మొత్తం జనభాతో గణించి ఖరారుచేశారు. బీసీ రిజర్వేషన్ విషయానికి వస్తే బీసీ వర్గానికి చెందిన మండల ఓటర్లను, మొత్తం మండల ఓటర్లతో భాగించి మండలంలోని మొత్తం పంచాయతీలతో గణిస్తారు. ఇలా వచ్చిన పంచాయతీలను బీసీలకు కేటాయిస్తారు.

    ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాత మిగిసిన గ్రామ పంచాయతీలను అన్ అన్ రిజర్వ్డ్ కేటరిగీకి ఖరారు చేస్తారు. రిజర్వేషన్ లెక్కలు పూర్తైన అనంతరం ఆయా వర్గాలకు కేటాయించిన స్థానాల్లో 50శాతం మహిళలకు కేటాస్తారు. అంటే ఎస్సీలకు కేటాయించిన వాటిలో 50శాతం, ఎస్టీలకు కేటాయించిన వాటిలో 50శాతం, బీసీల కోటాలో 50శాతం, జనరల్ స్థానాల్లో 50శాతం చొప్పున మహిళలకు ఇస్తారు.

    గ్రామ పంచాయతీలతో పాటు వార్డులకు కూడా అధికారులు రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఇవి గ్రామ జనాభా, ఓటర్లు, వార్డుల సంఖ్య, ఆధారంగా ఖరారు చేస్తారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు