M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తన 25వ పెళ్లి రోజును (YS Jagan Wedding Anniversary) జరుపుకునేందుకు సిమ్లా (Shimla) వెళ్లిన సంగతి తెలిసిందే. అధికార కార్యక్రమాలకు ఐదు రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన జగన్ కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. ఐతే జగన్ సిమ్లా టూర్ బయటకి ఫ్యామిలీ ట్రీప్ లా కనిపించిన ఇది పూర్తిగా పొలిటికల్ టూర్ గా చెబుతున్నాయి సీఏంవో వర్గాలు. త్వరలో కేబినేట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనలోనే జగన్ నూతన మంత్రులు లిస్ట్ ను ఖరారు చేస్తారనే వార్తలు ఇప్పుడు చక్‌ిర్లు కొడుతున్నాయి. దీంతోపాటు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా జగన్ పనితీరు పట్ల ప్రజల అభ్రిపాయాలతో పాటు వచ్చే రెండేళ్లు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనేదానిపై జగన్ ఈ టూర్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పలువురు కీలక నేతలు జగన్ పర్యటనకు ఒక రోజు ముందే సిమ్లా చేరుకున్నట్లు సమాచారం. బయటకి మాత్రం జగన్ దంపతుల 25వ పెళ్లిరోజు వేడుకలకు వెళ్లినట్లు కనిపించినా ఇది పక్కా పోలిటికల్ అంశాలు చర్చించడానికే అంటున్నారు సొంత పార్టీ నేతలు.
ఇదిలా ఉంటే ఇప్పటికే మంత్రి పదవులు కోసం పలువురు ఎమ్మెల్యేలు జగన్ ముందు విన్నపాలు పెట్టుకున్నారు. వారి విన్నపాల పట్ల ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరో వైపు ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న అంబటి రాంబాబు లాంటి నేతలు ఇటీవల ఆడియో లీక్ వివాధాల్లో ఇరుక్కుపోవడం వారికి తలనొప్పిగా మారింది. అయితే ఈ ఆడియో లీకుల వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారనే సమాచారం జగన్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఒకరిపై ఒకరు ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వం, పార్టీ పరువు పోతుందని జగన్ సిరియస్ అయినట్లు సీఏంవో వర్గాల సమాచారం. మరో వైపు గతంలో తొలిసారి కేబినేట్ ఏర్పడినప్పుడు జగన్ అందరికీ న్యాయం చేయలేకపోయారు. దీంతో రోజా లాంటి నేతలకు ఖచ్చితమైన హామీలు ఇచ్చారు. రెండేళ్ల తరువాత తప్పుకుండా కేబినేట్ లోకి తీసుకుంటామని అందులో భాగంగానే ఎమ్మెల్యే రోజాను కేబినేట్ లోకి తీసుకోవడం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఇక అంబటి రాంబాబుకు కూడా హామీ వచ్చినప్పటకీ ఆడియో లీకుల వ్యహారం ఆయనకు మైనస్ గా మారింది. ఇదిలాఉంటే మరోవైపు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో దాదాపు 90శాతం మందిని జగన్ ఇంటికి పంపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దేవాదాయశాఖ, విద్యాశాఖ మంత్రలుకు ఇప్పటికే జగన్ చెప్పేసిట్లుకూడా సమాచారం. దీంతో తమ పదవులు పోకుండా కాపాడుకోవడానికి మంత్రులు ప్రయత్నలు చేస్తోన్నారు. తాజాగా అంబటి తరువాత అవంతి ఆడియో టేపులు బయటికి రావడంతో ఇప్పుడు ఆయన్ని కూడా జగన్ మంత్రి పదవి నుంచి పక్కన పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఈ సిమ్లా ట్రిప్ నుంచి రాగానే కేబినేట్ లో మార్పులు ఖాయమని తెలుస్తోంది. దీంతో ఎవరు ఇన్.. ఎవరు ఔట్ అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy