Home /News /politics /

HERE ARE THE FULL DETAILS ABOUT HOW TOWNS AND MUNICIPAL COUNCILS TO BE FORMED IN ANDHRA PRADESH PRN

AP Municipal Elections: ఏపీలో ఎన్నిరకాల పట్టణాలున్నాయో తెలుసా..? మున్సిపాలిటీల ఏర్పాటు ఎలాగంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: రాష్ట్రంలోని పట్టణాలను మొత్తం ఆరు శ్రేణులుగా విభజించారు. జనాభా ఆధారంగా వాటికి గ్రేడ్ ను కేటాయిస్తారు

    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరింది. పురపోరులో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. పట్టణాలను కైవసం చేసుకునేందుకు అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాలు అంటే ఏంటి.. మున్సిపాలిటీలు ఎలా ఏర్పడతాయి.. పట్టణాల్లో ఎన్ని రకాలుంటాయనే అంశాలు తెలుసుకుందాం. కనీసం లక్ష జనాభా ఉండే ప్రాంతాలను పట్టణాలుగా పరిగణిస్తారు. అంతకుమించితే నగరాలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా ఏదైనా ప్రాంతాన్ని పట్టణంగా పరిగణించాలంటే కొన్ని లక్షణాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం 5వేల జనభా ఉండి పురుష కూలీల్లో 75శాతం వ్యవసాయేతర పనులు చేసుకుంటూ ఉండటం, జనసాంధ్రతలో చదరపు మైలుకు వెయ్యి వరకు జనాభా ఉంటే పట్టణంగా వర్గీకరిస్తారు. రాష్ట్రంలోని పట్టణాలను మొత్తం ఆరు శ్రేణులుగా విభజించారు. జనాభా ఆధారంగా వాటికి గ్రేడ్ ను కేటాయిస్తారు.

    లక్ష జనాభా ఉంటే దానిని గ్రేడ్-1 పట్టణంగా 50 వేల నుంచి 99,999 వరకు జనాభా ఉంటే దానిని గ్రేడ్-2 పట్టణంగా.. 20 వేల నుంచి 49,999 మంది జనాభా ఉంటే దానిని గ్రేడ్-3 పట్టణంగా.. 10 వేల నుంచి 19,999 మంది జనాభా ఉంటే దానిని గ్రేడ్-4 పట్టణంగా.. 5 వేల నుంచి 9,999 మంది జనాబా ఉంటే దానిని గ్రేడ్-5 పట్టణంగా.. 5వేల కంటే తక్కువ జనాభా ఉంటే గ్రేడ్-5 పట్టణంగా పరిగణిస్తారు.

    ఇది చదవండి: తిరుపతిలో బెజవాడ రాజకీయం పనిచేస్తుందా...? వైసీపీకి ఆయన చెక్ పెడతారా..?



    మున్సిపాలిటి ఎలా ఏర్పడుతుందంటే..ఏధైనా ప్రాతంలో 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాన్ని మున్సిపాలిటీగా పరిగణిస్తారు. అలా ఏర్పాటు చేయడానికి ముందుగా గెజిట్ ద్వారా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపల్ వ్యవస్థలో కౌన్సిల్, ఛైర్మన్, కమిషనర్, వార్డు వ్యవస్థలుంటాయి. కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి ముందు ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించవచ్చు.కౌన్సిల్, ఛైర్ పర్సన్, కమిటీలు, కమీషనర్ నిర్వహించే విధులు ప్రత్యేక అధికారి నిర్వహిస్తారు. ఏడాదిలోగా గ్రామాల విలీన ప్రక్రియ, రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

    ఇది చదవండి: కేఏ పాల్ చిత్రపటానికి పాలాభిషేకం.. కారణం ఇదే..



    ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఉంటుంది. ఐదేళ్ల పాటు నెలనెల వారికి గౌరవేతనం చెల్లిస్తారు. ఈ వేతనం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆర్ధిక స్థితి, రాబడిని బట్టి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారి జీతభత్యాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఐతే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా జీతభత్యాలుండవు. ప్రభుత్వ జీవో ప్రకారం గ్రేడ్-1 కార్పొరేషన్ కు ఒక విధంగా, గ్రేడ్-2 కార్పొరేషన్లకు మరో విధంగా ఉంటాయి. అలాగే జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలకు ఒకలా.. జిల్లా కేంద్రం కాని మున్సిపాలిటీలకు మరోలా జీతభత్యాలను నిర్ణయించారు.

    ఇది చదవండి: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో విచిత్ర పొత్తులు.. మిత్రులెవరో.. శత్రువులెవరో..!



    ఉదాహరణకు రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేడ్-1లో ఉన్నాయి. ఈ నగరాల్లో మేయర్లు, కార్పొరేటర్ల జీతాలు ఇతర నగరాలతో పోలిస్తే అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ మూడు నగరాల్లో మేయర్ కు నెలకు రూ.30వేలు, డిప్యూటీ మేయర్ కు రూ.20 వేలు, కార్పొరేటర్ కు రూ.6వేలు జీతంగా నిర్ణయించారు. ఈ జీతాలను రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి పెంచుతుంటుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, AP News, Municipal Elections

    తదుపరి వార్తలు