Home /News /politics /

HERE ARE THE DETAILS ABOUT EXPENDITURE LIMITS FOR THE CANDIDATES WHO ARE CONTESTING IN ANDHRA PRADESH MUNICIPAL ELECTIONS PRN

AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయపరిమితి ఎంతో తెలుసా...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Municipal Elections: అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను ప్రతి మూడు రోజులకు ఒకసారి ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్ఈసీ విధించిన పరిమితిలోనే అభ్యర్థులు ప్రచారానికి సంబంధించిన అన్ని హంగులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అంకం పూర్తైంది. తుది పోరులో నిలిచే అభ్యర్థులెవరన్నది తేలిపోయింది. దీంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు ప్రచారబరిలో దిగిపోయారు. భారీ ర్యాలీలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఖర్చు తడిసి మోపెడవుతోంది. జెండాల దగ్గర నుంచి కరపత్రాలు, మైకులు, హోర్డింగులు, అనుచరులకు భోజనాలు, ఓటర్లకు తాయిలాలు ఇలా ఎన్నికలంటే ప్రతీది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. గెలుపు సంగతి అటుంచితే ఎన్నికల వరకు తమవారిని వెంట తిప్పుకునేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు కాసులు కుమ్మరించాల్సిందే. కార్పొరేషన్ కు ఒక విధంగా, మున్సిపాలిటికీ మరో విధంగా ఉంటే వ్యయపరమితి.. నగర పంచాయతీలకు వేరుగా ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన పరిమితికి మించి అభ్యర్థులు ఖర్చు చేయడానికి వీల్లేదు.

    వ్యయపరిమితి ఇలా..
    మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసిన వారు రూ.2లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. మున్సిపాలిటీలలో కౌన్సిలర్ పదవికి పోటీగా చేసేవారి ఖర్చు రూ.1.50 లక్షలకు మించకూడదు, ఇక నగరపంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు రూ.లక్ష మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను ప్రతి మూడు రోజులకు ఒకసారి ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్ఈసీ విధించిన పరిమితిలోనే అభ్యర్థులు ప్రచారానికి సంబంధించిన అన్ని హంగులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

    ఇది చదవండి: పురపోరులోనూ వైసీపీదే హవా... ఏకగ్రీవాల్లో జోరు.. జిల్లాల వారీ రిపోర్ట్ ఇదే



    ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించడానికి గణాంక, ఆడిట్, ఖజానా శాఖ అదికారులను తాత్కాలికంగా నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నమూనా ఆధారంగానే ఖర్చుల వివరాలను అభ్యర్థుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన 45 రోజుల్లోపు పోటీలో ఉన్న అభ్యర్థులు తమ చేసిన ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అలా సమర్పించని పక్షంలో నోటీసులు జారీ చేస్తారు. నోటీసులకు స్పందించకుంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Municipal Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు