Home /News /politics /

HERE ARE THE DETAILS ABOUT ELECTION EXPENDITURE LIMITS IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల వ్యయ పరిమితి ఎంతో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హడావిడే నడుస్తోంది. ఏ ఎద్దర్ని కలిదిలించినా ఎన్నికలు, ఏకగ్రీవాల గురించే మాట్లాడుకుంటున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల హడావిడే నడుస్తోంది. ఏ ఎద్దర్ని కలిదిలించినా ఎన్నికలు, ఏకగ్రీవాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 9 నుంచి 21 వరకు మొత్తం నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. రెండో దశ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అలాగే పల్లె పోరులో గెలిచేందుకు డబ్బులను కూడా మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రచారానికి వచ్చే జనాననికి భోజనాలు, గుర్తులకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు, జెండాలు, బ్యానర్లు ఇలా గ్రాపంచాయతీల కోసం లక్షలు కుమ్మరిస్తున్నారు. కొన్నిగ్రామాల్లో అయిన ఎన్నికల పోరు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది.

    ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కోసం ఎంత వరకు ఖర్చు చెయ్యొచ్చనే అంశంపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 10 వేలకు మించి జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థుల వ్యవపరిమితి రూ.50 వేలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. ఇక 10వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు మెంబర్లుగా పోటీపడే అభ్యర్థులైతే రూ.30 వేలు వరకు ఖర్చు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది.

    ఇక చాలా గ్రామాల్లో పరిమితికి మించి అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇది అభ్యర్థుల ఖాతాల్లో కాకుండా వారి బంధువులు, అనుచరుల ద్వారా ఖర్చుపెడుతున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో అనుచరులు, ప్రచారానికి వచ్చేవారికి భోజన ఏర్పాట్లే తడిసిమోపెడవుతున్నాయని.. ఎస్ఈసీ పర్మిషన్ ఇచ్చిన మేరకు ఖర్చు చేస్తే లాభమండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఎన్నికల సమయంలో ఎస్ఈసీ ఇచ్చిన పరిమితి కంటే భారీగా ఖర్చు చేయడం పరిపాటే.., కాకపోతే ఆ లెక్కలను అభ్యర్థుల ఖాతాల్లో వేయకుండా ఇతరుల ఎకౌంట్లలో చూపుతున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Local body elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు