Home /News /politics /

HERE ARE THE DETAILS ABOUT ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGANMOHAN REDDY NOT PAYING PROPERTY TAX FOR LAST TWO YEARS FOR HIS CAMP OFFICE AND HOUSE PRN GNT

CM Jagan House Tax: మరోవివాదంలో సీఎం జగన్... ఆస్తిపన్నుపై రగడ.. అసలు నిజం ఇదే..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) కదలికలు, ఆయన పాల్గొనే కార్యక్రమాలను మీడియా, ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉంటారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదలికలు, ఆయన పాల్గొనే కార్యక్రమాలను మీడియా, ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు సంబంధించిన మంచైనా, చెడైనా, విమర్శలైనా, ఆరోపణలైనా హైలెట్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం సీఎం జగన్ కు సంబంధించిన మరోఅంశం వైరల్ అయింది. ఆయన తన ఉంటున్న నివాసానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడంలేదు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్ ఒక్కరూపాయి కూడా ఆస్తిపన్ను చెల్లించలేదు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన సొంత భవనంలో నివాసముంటున్నారు. దానినే క్యాంపు కార్యాలయంగా చేసుకొని అధికారిక సమావేశాలు, ఇతర పనులు అక్కడి నుంచే చక్కబెడుతున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిపనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా వర్చువల్ విధానంలో తన ఇంటి నుంచే పాల్గొంటున్నారు. కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మాత్రమే జగన్ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్నారు.

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాడేపల్లిలో భవనం ఉంది. రెండు బ్లాకుల్లో ఉన్న ఒకటి కార్యాలయం కాగా.. మరొకటి నివాసం. ఆఫీసు 1750 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. మునిసిపల్‌ రికార్డు ప్రకారం దీని చిరునామా.. డోర్‌ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి – 522501 అని ఉంది.ఇదే ప్రాంగణంలో మొత్తం 219 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస భవనం కూడా ఉంది. దీని డోర్‌ నంబర్‌ 12-353/2/5. దీనిని జీ+2 గా నిర్మించారు. ఈ రెండు భవనాలు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి రెడ్డి పేరిట ఉన్నాయి. మునిసిపల్‌ శాఖ రికార్డుల ప్రకారం.. కార్యాలయం కోసం వినియగిస్తున్న భవనాన్ని కమర్షియల్ ప్రాపర్టీగా, ఇంటిని రెసిడెన్షియల్ ప్రాపర్టీగా చూపించారు. వార్షిక రెంటల్‌ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

    Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy, AP CM YS Jagan House, AP CM YS Jagan Camp Office, Andhra Pradesh CM YS Jagan News YS Jagan News, YS Jagan house in Tadepalli, Andhra Pradesh government, AP Government, Andhra Pradesh News, AP News, Andhra News, Telugu news, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం వైఎశ్ జగన్ నివాసం, ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వార్తలు, వైఎస్ జగన్ వార్తలు, తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, ఆంధ్రా వార్తలు,
    తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం


    మునిసిపల్‌శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారమే కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ పడ్డారు. ఇంటికి సంబంధించి 59,256 పన్ను బకాయి ఉంది. అంటే మొత్తం మునిసిపల్‌ శాఖకు రూ.13,85,196 పన్ను చెల్లించాల్సి ఉంది. ఇక రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో వాటికి పెనాల్టీలు కూడా పడ్డాయి. ఆఫీస్ భవనానికి అసలు 13,25,940, పెనాల్టీ 2,93,709 కలిపి మొత్తం 16,19,649, నివాస భవనానికి అసలు పన్ను 59,256, పెనాల్టీ 11,484 కలిపి రూ.70,740 చెల్లించాల్సి ఉంది. రెండు భవానలకి కలిపి 16,90,389 చెల్లించాల్సి ఉంది.

    సీఎం జగన్ నివాసానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిల వివరాలు


    సీఎం జగన్ కార్యాలయ భవనానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిల వివరాలు


    ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ప్రభుత్వం ఇస్తుంది. ఆలాగే ఆయనకు సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒకవేళ సీఎం ప్రభుత్వ భవనంలో నివశిస్తుంటే దానికి సంబంధించిన ఆస్తిపన్ను, ఇతర ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇక్కడ సీఎం జగన్... ప్రైవేట్ భవనంలో నివశిస్తున్నారుకాబట్టి సంబంధిత పన్నులన్నీ భవన యజమానే చెల్లించాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌ యాక్ట్‌-1953 ప్రకారం... ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక నివాసాలు సమకూర్చితే వాటి నిర్వహణ ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రైవేట్ నివాసాల్లో ఉంటే మాత్రం భవన యజమానే పన్నులు భరించాల్సి ఉంటుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Tadepalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు