మోదీ ప్రమాణస్వీకారోత్సవాన్ని టీవీలో చూసి మురిసిన తల్లి హీరాబెన్

తన కుమారుడు భారతదేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా చప్పట్లుకొట్టి అభినందించారు హీరాబెన్.

news18-telugu
Updated: May 30, 2019, 7:56 PM IST
మోదీ ప్రమాణస్వీకారోత్సవాన్ని టీవీలో చూసి మురిసిన తల్లి హీరాబెన్
తన కుమారుడు భారతదేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా చప్పట్లుకొట్టి అభినందించారు హీరాబెన్.
  • Share this:
'మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ'..అంటూ భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు మోదీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం కన్నుల పండువలా జరిగింది. మోదీ ప్రమాణస్వీకారాన్ని ఆయన తల్లి హీరాబెన్ టీవీలో చూసి మురిసిపోయారు. ఇంట్లో కూచొని టీవీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఆమె వీక్షించారు. తన కుమారుడు భారతదేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా చప్పట్లుకొట్టి అభినందించారు హీరాబెన్.
మోదీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా,నితిన్ గడ్కరీ, సదానందగౌడ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్, థావర్ చంద్ గెహ్లాట్, ఎస్.జయశంకర్, రమేశ్ పొఖ్రియాల్, అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్, పీయుష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి మయన్మార్ అధ్యక్షుడు విన్ మియంట్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ, మయన్మార్ ప్రత్యేక రాయబారి, కిరిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సూరంబే జీన్బెకోవ్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో పాటు 'బిమ్‌స్టెక్' దేశాధినేతలు హాజరయ్యారు.


మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఎల్‌కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సర్ సోనియా, కాంగ్రెస్ సీనియర నేతలు గులాంనబీ ఆజాద్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్నాటక సీఎం కుమారస్వామి, చత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం ఈ.పళనిస్వామి, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, ప్రముఖు పారిశ్రామిక వేత్తలు ముఖేశ్ అంబానీ, రతన టాటా, సినీ ప్రముఖులు రజినీకాంత్ తదితరులు తరలివచ్చారు.
First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...