HOME »NEWS »POLITICS »heavy competition between telangana bjp leaders to contest from secunderabad constituency ps

బీజేపీలో సికింద్రాబాద్ సీటుపై కిరికిరి.. టిక్కెట్ ‌కోసం పోటీలో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి

బీజేపీలో సికింద్రాబాద్ సీటుపై కిరికిరి.. టిక్కెట్ ‌కోసం పోటీలో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి
లక్ష్మణ్, కిషన్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బీజేపీ.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. 2014లో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. ఈసారి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆ షాక్ నుంచి త్వరగానే తేరుకున్న కమలదళం.. వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలవాలనుకుంటోంది. అంతేకాదు, గత ఎన్నికల్లో గెలిచిన సికింద్రాబాద్ స్థానంపైనే మళ్లీ గురిపెట్టింది.

  • Share this:
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బీజేపీ.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. 2014లో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. ఈసారి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆ షాక్ నుంచి త్వరగానే తేరుకున్న కమలదళం.. వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ  స్థానాలను గెలవాలనుకుంటోంది.  అంతేకాదు, గత ఎన్నికల్లో గెలిచిన సికింద్రాబాద్ స్థానంపైనే మళ్లీ గురిపెట్టింది. మరో నాలుగైదు స్థానాలనూ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే, గతంలో గెలిచిన సికింద్రాబాద్ స్థానంలోనే పోటీ చేసేందుకు కీలక నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయకు ఈసారి సీటు రావడం అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత కిషన్ రెడ్డిల మధ్య సికింద్రాబాద్ సీటు విషయమై తీవ్ర పోటీ నెలకొంది. అయితే, వీరిద్దరూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే, అందుకు సేఫ్ జోన్‌గా సికింద్రాబాద్‌గా భావిస్తున్న ఈ ఇద్దరు నేతలు.. అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది తెలియాల్సి ఉంది.

    ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసిన లక్ష్మణ్, భారీ తేడాతో ఓడిపోగా.. కిషన్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో బీజేపీ సికింద్రాబాద్ సీటును కిషన్ రెడ్డికే ఇస్తుందా? లేక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతుందా అనేది త్వరలోనే తేలనుంది. అయితే, తాను త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని, అది సికింద్రాబాద్ నుంచేనని.. తన సన్నిహితుల దగ్గర కిషన్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు, లక్ష్మణ్ కూడా పోటీకి సంబంధించి.. అంతే విశ్వాసంతో, పట్టుదలతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి, బీజేపీ హైకమాండ్ మదిలో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి.

    First published:March 15, 2019, 17:59 IST