కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకుని తిరిగి పగ్గాలు చేపట్టాలని పార్టీ సినియర్లు ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. ఆయన మాత్రం అందుకు సుముఖంగా లేరు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైంది.

news18-telugu
Updated: July 31, 2019, 12:10 PM IST
కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ (File)
  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంలో కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. పదవి నుంచి తప్పుకున్న రాహుల్.. తదుపరి అధ్యక్షుడి ఎంపికలో తాను జోక్యం చేసుకోబోనని తేల్చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారు.. ఎప్పుడు చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీతో పలువురు పార్టీ నేతలు ఇదే విషయంపై చర్చించారు. అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే ఆలస్యమైందని.. వచ్చే వారంలో ఎంపిక జరిగిపోవాలని రాహుల్ వారితో వ్యాఖ్యానించారు. అయితే
అధ్యక్ష పదవి కోసం తన కుటుంబం నుంచి గానీ ఇతరులను గానీ తాను ప్రతిపాదించబోనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు లేదా ఇన్‌చార్జి ఎంపిక వచ్చే వారం లోపు జరగవచ్చు. అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం కంటే ముందు తాత్కాలిక అధ్యక్షుడి ఎంపిక అవసరం.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు


రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకుని తిరిగి పగ్గాలు చేపట్టాలని పార్టీ సినియర్లు ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. ఆయన మాత్రం అందుకు సుముఖంగా లేరు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైంది. దీంతో కింది స్థాయి నేతలు ఢీలా పడే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగాలని కోరుకుంటున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: July 31, 2019, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading