Punjab Next CM: పంజాబ్​ తదుపరి ముఖ్యమంత్రిగా అతనే..! కారణం ఏంటో తెలుసా?

సునీల్​ జాఖర్​ (Photo : twitter)

శనివారం సాయంత్రం సీఎం అమరీందర్​ రాజీనామా చేశాడు. గవర్నర్​కు రాజీనామా పత్రం అందజేశాడు. తనకు పార్టీలో అవమానం జరిగిందని అమరీందర్​ వాపోయాడు. అయితే ఇపుడు పంజాబ్​ కొత్త సీఎం ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో సీఎం పీఠం ఎవరికి ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇపుడు ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనే సీఎం అంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ అతనెవరంటారా?

  • Share this:
    పంజాబ్ (Punjab) ​లో రాజకీయ వేడి రాజుకుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ (Amarinder singh)​కు వ్యతిరేకంగా మారడంతో రాజీనామా చేయని పరిస్థితి వచ్చింది. ఏడాదిలో ఎన్నికలున్నా సీఎం మార్పు అనివార్యమైంది. ఈ మేరకు శనివారం సాయంత్రం సీఎం అమరీందర్​ రాజీనామా (CM resign) చేశాడు. గవర్నర్​కు రాజీనామా పత్రం (Resignation) అందజేశాడు. తనకు పార్టీలో అవమానం జరిగిందని అమరీందర్​ వాపోయాడు. అయితే ఇపుడు పంజాబ్​ కొత్త సీఎం (Punjab New CM) ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో సీఎం పీఠం ఎవరికి ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇపుడు ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనే సీఎం (Chief Minister) అంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ అతనెవరంటారా? పంజాబ్​ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ (Sunil Jakhar). అవును సీద్ధూ కాదని సునీల్​కే సీఎం (CM) పీఠం అప్పగించనున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే సునీల్​కే ఎందుకంటే ఇంటరెస్టింగ్​ అప్​డెట్స్​ (Updates) తెలిశాయి.. అవేంటంటే..

    సిక్కూయేతర వ్యక్తికి సీఎం..

    వచ్చే ఏడాదిలో ఎన్నికలు (Elections) ఉన్నాయి. మరోవైపు పంజాబ్​లో అధికారంలో ఉన్నా కూడా.. ఆమ్​ఆద్మీ (Aam Adhmi) పార్టీ లోతుగా పాతుకుపోతోంది. బలపడుతోంది. దీంతో పార్టీలో పీసీసీ చీఫ్ పదవి, ముఖ్యమంత్రి పదవులను ఒకే వర్గానికి కాకుండా ఇరు వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే పీసీసీ చీఫ్ (PCC Chief)​ పదవి నవ్యజోత్​ సింగ్​ సిద్ధూకు ఇచ్చేశారు. ఇక సీఎం పదవి సిక్కుయేతర (Non sikh) వ్యక్తికి ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సునీల్​ జాఖర్ (Sunil jakhar)​ పేరు తెరపైకి వచ్చింది. సునీల్​ను సీఎం (Chief Minister)గా ఎన్నుకుంటారని రాజకీయ వర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి.

    ఎవరీ సునీల్ జాఖర్..

    పంజాబ్​లోని పంకోసీ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల సునీల్​ జాఖర్ గతంలో పంజాబ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అబోహర్ నియోజకవర్గం నుంచి జాఖర్ వరుసగా (2002-2017) ఎన్నికయ్యారు. 2012 నుంచి 2015 వరకు పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

    2017లో జరిగిన గురుదాస్పూర్ లోక్​సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచాడు. అయితే 2019లో అదే స్థానం నుంచి సన్నీ డియోల్​పై ఓడిపోయారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్​ పదవికి సైతం రాజీనామా చేశాడు సునీల్​ జాఖర్​. రాష్ట్రంలోని 13 సీట్లలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆయన రాజీనామా చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published: