జగన్ వచ్చారని... వరుణుడు పారిపోయాడా? : లోకేష్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: August 15, 2019, 10:30 PM IST
జగన్ వచ్చారని... వరుణుడు పారిపోయాడా? : లోకేష్
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో నీటి సమస్యపై ఆయన ట్విట్టర్‌లో కామెంట్స్ చేశారు. ‘సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోంది. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోంది. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైసీపీ నేతలు మా జగనన్న భగీరధుడు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 3 జిల్లాల్లోనే సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరివ్వమంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు. మరి వరుణుడు ఏమయ్యాడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలిసిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా? వైసీపీ మేధావులు మాత్రమే సమాధానం చెప్పాలి.’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు